తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లారు. కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షా తో భేటీ అయ్యారు. అమిత్ షా తో అభ్యర్థుల ఎంపిక అంశం, పార్టీ లో నెలకొన్న పరిస్థితి లు, మోడీ సభ పై కిషన్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. మోడీ సభ పై కూడా కిషన్ రెడ్డి వివరించినట్లు, తెలంగాణ లో మరిన్ని మోడీ సభలు పెట్టాలని ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మల్, కరీంనగర్ లలో కూడా మోడీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉంది. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు సమావేశం అయిన బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు.. అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేసిన నేతలు.. కొన్ని నియోజక వర్గాలకు పేర్లని ఖరారు చేసినట్టు సమాచారం. నెక్ట్స్ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ లో తెలంగాణ అభ్యర్థులు పై చర్చ జరిగే అవకాశం ఉంది.
Also Read : Cops Harass Woman: పార్క్‌లో కూర్చున్న యువతిని లైంగికంగా వేధించి.. డబ్బు వసూలు చేసిన పోలీసులు!
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ రెండోవారంలో తెలంగాణ అభ్యర్థుల లిస్ట్ ప్రకటన ఉంటుందని ఆయన అన్నారు. అక్టోబర్ రెండోవారంలో బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డ్ లను ప్రధాని ప్రకటించారని, పసుపు బోర్డ్ కోసం ఎన్నో ఏళ్లుగా రైతుల డిమాండ్ ఉందన్నారు. రేపు మోడీ మళ్ళీ తెలంగాణకు వస్తున్నారని, నిజామాబాద్ భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారని ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పాలమూరు సభ జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ నెల 10 న అమిత్ షా తెలంగాణకు వస్తారని, అక్టోబర్ 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటాయన్నారు కిషన్ రెడ్డి. జేపీ నడ్డా రానున్న ఎన్నికల కోసం దిశానిర్దేశం చేస్తారని అన్నారు.
Also Read : Mahatma Gandhi: భారతీయ కరెన్సీపై మహాత్మా గాంధీ ఫోటో పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా?
