Satya Pal Malik: జమ్మూ కాశ్మీరు మాజీ గవర్నర్ ఇంట్లో సీబీఐ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiru Hydropower corruption case: జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నేటి ఉదయం నుంచి ఢిల్లీతో పాటు వివిధ పట్టణాల్లో ఆయనకు సంబంధించిన 30 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది సీబీఐ అధికారులు పాల్గొన్నారు.
Read Also: Tunnel Roads: హైదరాబాద్ లో 5 టన్నెల్ రోడ్లు.. మూడు మార్గాల్లో 39 కి.మీటర్లు మేర సొరంగం
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
కాగా, సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా ఉన్న సమయంలో 2,200 కోట్ల రూపాయల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై 2022వ సంవత్సరం ఏప్రిల్ నెలలో సత్యపాల్ మాలిక్ సహా ఐదుగురిపై సీబీఐ కేసు ఫైల్ చేసింది. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు ఆయన జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా పని చేశారు. అయితే, సీబీఐ సోదాలపై సత్యపాల్ రియాక్ట్ అయ్యారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో.. తన నివాసంపై నిరంకుశ శక్తులు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ సోదాల ద్వారా తన డ్రైవర్, సహాయకుడిని అనవసరంగా వేధిస్తున్నారని మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సోదాలకు తాను భయపడేది లేదన్నారు. రైతుల పక్షాన నిలబడతానని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యలు తనను నిలువరించలేవని సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా చెప్పుకొచ్చారు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని ఓ హస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!