NTV Telugu Site icon

Dilruba Poster: వాలెంటైన్స్‌డే నాడు రాబోతున్న ‘దిల్‌రూబా’

Dil Ruba

Dil Ruba

Dilruba Poster: టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం తన 10వ సినిమా ‘దిల్‌రుబా’ తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పూర్తి స్థాయిలో స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆయన కొత్త లుక్ ఫుల్ స్వాగ్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో కిరణ్ అబ్బవరం మంచి హ్యాండ్సమ్ లుక్‌తో పాటు, కలర్‌ఫుల్ బ్యాక్‌ డ్రాప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. లవ్ అండ్ యాక్షన్ మిక్స్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: Nari Nari Naduma Murari: శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్

ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం స్టైలిష్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పెద్ద ఎట్రాక్షన్ కానుంది. ‘దిల్‌రుబా’ సినిమాకు డెబ్యూట్ డైరెక్టర్ విశ్వ కరుణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శివం సెల్యులాయిడ్స్, సరిగమ ఇండియా లిమిటెడ్‌కి చెందిన యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్‌లో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. ప్రేమ, వినోదం, యాక్షన్ మిశ్రమంతో ‘దిల్‌రుబా’ ఈ వాలంటైన్స్ డేకు ప్రేక్షకుల ముందుకు వచ్చి కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఎంతవరుకు విజాయామ్ సాధిస్తాడా వేచి చూడాల్సిందే.

Show comments