గత ప్రభుత్వ హస్తాల్లో ఐదు సంవత్సరాలు రాష్ట్రం విలవిల్లాడిందని., అధికారం దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని తీవ్ర కష్టాల్లో ఉంచారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన ఆరోపించారు. అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వాడాలని., ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి ఫలితాలు ఎప్పుడు చూడలేదని ఆయన పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల సమయంలో జరిగిన పరిపాలన చూసే ఈ ఫలితాన్ని ప్రజలు ఇచ్చారని ఆయన తెలిపారు.
Nara Lokesh: బాధ్యత మరింత పెరిగిందన్న నారా లోకేష్..
ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి పనిచేశాయని, ఓటు వేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని., కేంద్రం సహకారంతో.రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రమాణ స్వీకారం తేదీ అతి త్వరలో ప్రకటిస్తామని., 161 స్థానాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ముందు నుంచి చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడుతూ.. ఏ వర్గం సంతోషంగా ఉందని జగన్ కు ప్రజలు ఓట్లు వేస్తారు..? అని ఆయన అన్నారు. ఇక తనకు పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. దేవుళ్ళు పై దాడులు, మహిళ మీద దాడులు అనేక న్యాయాలు గత ప్రభుత్వంలో జరిగాయని., జగన్ ఇంటికి పంపాలని ధ్యేయంతోనే ప్రజలు ఓట్లేశారని ఆయన చెప్పుకొచ్చారు.
Anam Ramanarayana Reddy: టీడీపీ కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి..