Site icon NTV Telugu

Kingdom Collections Day 1: బాక్సాఫీస్ ను కుమ్మేసిన విజయ్.. కింగ్‏డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Kingdom

Kingdom

టాలీవుడ్ రౌడీ బాయ్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏ జూలై 31న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ టైమ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద కింగ్ డమ్ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ ను కుమ్మేశాడు. కింగ్ డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం.

Also Read:Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు.. 5న హాజరుకావాలని ఆదేశం

ఈ సినిమా డే 1 తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లు కలిపి సాధించిన వసూళ్ల విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో – రూ. 4.20 కోట్ల షేర్.. రాయలసీమ(సీడెడ్ )లో రూ. 1.70 కోట్లు షేర్, ఉత్తరాంధ్ర – రూ. 1.16 కోట్ల షేర్, ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ. 75 లక్షల షేర్, ఉమ్మడి తూర్పు గోదావరిలో – రూ. 74 లక్షల షేర్, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో, రూ. 44 లక్షల షేర్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో, రూ. 0.59 లక్షల షేర్, ఉమ్మడి నెల్లూరులో ..రూ. 34 లక్షల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read:AP Liquor Scam Case: విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్‌ రెడ్డి

మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 9.92 కోట్ల షేర్ (రూ. 18 కోట్ల గ్రాస్) వరకు కలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. యూఎస్ లో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువగానే గ్రాస్ వచ్చింది. అంటే 8 కోట్లకు పైగా ఓవర్సీస్ లో వచ్చాయి. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 53.50 కోట్ల షేర్ రాబట్టాలి. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వీకెండ్ రోజుల్లో వచ్చే కలెక్షన్స్ తో రీచ్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version