Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kidney Racket Busted In Visakhapatnam

Kidney Racket: విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. పేదవాళ్లను లక్ష్యంగా చేసుకుని దందా!

Published Date :April 27, 2023 , 8:47 am
By Mahesh Jakki
Kidney Racket: విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. పేదవాళ్లను లక్ష్యంగా చేసుకుని దందా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kidney Racket: విశాఖ తీరంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్లను టార్గెట్ చేసిన గ్యాంగ్.. డబ్బు ఆశచూపి అమాయకుల కిడ్నీ తీసుకుని మోసం చేస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ అరాచకాలు బయటపడ్డాయి. పెందుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుత్రి ఈ దారుణమైన కిడ్నీరాకెట్‌ దందాకి తెరతీసింది. పేదజనం అవయవాలను కాజేస్తోన్న ఓ ముఠా చేతిలో వినయ్‌కుమార్ అనే యువకుడు బలయ్యాడు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. అయితే ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా ఏడుగురు బాధితుల నుంచి కేటుగాళ్లు కిడ్నీలు తీసేసుకున్నట్లు తెలిసింది. మధురవాడ వాంబే కాలనీకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ వినయ్‌కుమార్‌‌తో స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగి కామరాజుతో కొంత కాలంగా పరిచయం ఉంది. వినయ్ తన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని తన బాధను చెప్పుకున్నాడు. ఇదే అదునుగా భావించిన కామరాజు.. కిడ్నీ అమ్మితే రూ.ఎనిమిదిన్నర లక్షలు వస్తాయని వినయ్‌కు చెప్పి నమ్మేలా చేశాడు.

ఈ విషయం వినయ్ తల్లిదండ్రులకు తెలియడంతో అతడిన మందలించి.. ఇక్కడ ఉండొద్దని హైదరాబాద్ పంపించారు. తర్వాత కూడా కామరాజు తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు బాధితుడు వినయ్ తెలిపారు. కిడ్నీ ఇస్తానని మోసం చేశావని.. తల్లిదండ్రులను రోడ్డుకు ఈడుస్తానని బెదిరించాడని.. కామరాజు ఒత్తిడితో హైదరాబాద్‌ నుంచి వచ్చినట్లు వినయ్ చెప్పాడు. ఆ వెంటనే తనను రైల్వే న్యూ కాలనీ దగ్గర నుంచి పెందుర్తికి తీసుకువెళ్లాడని వినయ్ వివరించాడు. పెందుర్తి దగ్గర ఉన్న తిరుమల ఆస్పత్రిలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. కిడ్నీ తీసేసినట్లు చెప్పాడు. తాను ఇంటికి వచ్చాక రూ.ఐదు లక్షలు ఇచ్చారని వీడియో తీయించి.. తన తండ్రికి మాత్రం రూ.2లక్షల 50 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. కామరాజు మిగిలిన డబ్బులు తీసుకెళ్లాడని.. రూ.8 లక్షలు ఇస్తామని.. రూ.2 లక్షల 50 వేలు మాత్రమే ఇచ్చినట్లు వినయ్ తెలిపాడు. తాను ఇప్పుడు నడవలేకపోతున్నట్లు బాధితుడు వినయ్ చెప్పాడు. కిడ్నీ ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని భావించానని.. కానీ నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడు వినయ్‌కుమార్‌ పీఎంపాలెం స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పీఎం పాలెం పోలీసులు.. ఈ కేసును పెందుర్తి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.

Read Also: ACB Raids: ఏపీలో అవినీతి అధికారులపై దాడులు.. లక్షల్లో నగదు స్వాధీనం

బాధితుడి ఫిర్యాదుతో ఈ పెందుర్తి కిడ్నీ రాకెట్‌ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. డీసీపీ విద్యాసాగర్‌ నాయుడు పెందుర్తిలోని తిరుమల ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకున్నారు. తిరుమల ఆస్పత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆశాస్త్రీయంగా కిడ్నీ తొలగించడంతో బాధితుడు వినయ్ కుమార్ మంచం పట్టినట్లు విచారణలో వెల్లడైంది. 8.5 లక్షలకు బ్రోకర్లు కామరాజు, శ్రీను డీల్ కుదుర్చుకున్నారు. పెందుర్తి తిరుమల ఆసుపత్రిలో అపరేషన్ చేయించారు. కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండా సర్జరీ చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అర్ధోపెడిక్ సర్జన్ పరమేశ్వరరావు కు కిడ్నీ ఆపరేషన్ చేసే అర్హత కోణంలో విచారణ చేపట్టారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. పేదరికం అడ్డు పెట్టుకుని కేటుగాళ్లు అవయవ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పెందుర్తి తిరుమల ఆసుపత్రి కేంద్రంగా దందా జరుగుతోందని.. ఆసుపత్రి మూసివేసి తిరుమల ఆసుపత్రి యాజమాన్యం పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మధ్యవర్తులు శ్రీను, కామరాజు, ఎలినా,కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • Crime News
  • Kidney racket
  • Kidney racket busted
  • Visakhapatnam

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions