కన్నడ స్టార్ హీరో ‘కిచ్చా’ సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్’ (Mark). గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, యోగిబాబు, విక్రాంత్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. థియేట్రికల్ రిలీజ్ సమయంలో తెలుగులో భారీ చిత్రాల పోటీ ఉండటంతో ‘మార్క్’ సినిమాకు థియేటర్ల కొరత ఏర్పడింది. అయినప్పటికీ, సుదీప్ మార్క్ యాక్షన్ అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ బాక్సాఫీస్ వద్ద తన ముద్ర వేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
Also Read : Kriti – Keerthy Suresh : కృతి శెట్టికి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్.. చేతికి వచ్చిన బాలీవుడ్ ఆఫర్ మాయం!
సుదీప్ ‘మార్క్’ సినిమా జనవరి 23న జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ మూవీలో సుదీప్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. కథలో కొన్ని ఊహించదగిన ట్విస్టులు ఉన్నప్పటికీ, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. థియేటర్లలో మిస్ అయిన వారు జనవరి 23 నుండి ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు.
