బాలివుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాని అటు హిందీ, ఇటు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది.. ఇటీవల తాను ప్రేమించిన సిద్ధార్థ్ మల్హోత్రా ను పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ అస్సలు ఖాళీ లేదని చెప్పాలి.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. తన పర్సనల్ విషయాలు లేటెస్ట్ ఫొటోలతో పాటు సినిమా విషయాలను షేర్ చేస్తుంది.. తాజాగా స్కిన్ టైట్ డ్రెస్సులో అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి..
బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘డాన్ 3’. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న ‘డాన్ 3’లో రణ్వీర్ సింగ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది కియారా.. ఈరోజు సినిమాలో భారీ యాక్షన్ సన్నీ వేశాల కోసం ప్రత్యేకమైన స్టంట్స్ ను కూడా కియారా నేర్చుకుంటుంది.. గత ఏడాది ‘సత్యపేమ్ కీ కహానీ’ చిత్రంతో అలరించిన ముంబై బ్యూటీ ఈ ఏడాది మూడు చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో ‘గేమ్ ఛేంజర్’, హిందీలో ‘వార్ 2’, డాన్ 3 చిత్రాల్లో నటిస్తుంది..
ఇక కియారా అద్వానీ తల్లి కాబోతుంది అంటూ కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే చాలాసార్లు కియరా అద్వాని ప్రెగ్నెంట్ అంటూ వైరల్ న్యూస్ వినిపించినప్పటికీ ఇందులో ఏది నిజం కాలేదు.కానీ ఇటీవల తన భర్తతో దిగిన ఫోటోలలో పొట్ట కాస్త ఎక్కువగా ఉండటంతో ఆమె ప్రగ్నెంట్ అని తెగ ట్రెండ్ చేస్తున్నారు.. మరి దీనిపై కియారా క్లారిటి ఇవ్వాల్సి ఉంది.. సినిమాల విషయానికొస్తే.. తాజాగా రామ్ చరణ్ కి జంటగా గేమ్ ఛేంజర్ మూవీలో కియారా నటిస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా మరోసారి కియారా నటిస్తుంది.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..