Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam student: తమ కన్నబిడ్డ ఉన్నత చదువులు చదివి తమను బాగా చూసుకుంటాడని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ వారి కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఎంఎస్ చేయడానికి వెళ్లిన కొడుకు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లాకు చెందిన మహంకాళి అఖిల సాయి సోమవారం రాత్రి బుల్లెట్ తగిలి మృతి చెందారు. తుపాకీ మిస్ ఫైర్ అయిందని మొదట చాలామంది అనుకున్నారు. అయితే తర్వాత స్నేహితుల హస్తం ఇందులో ఉందనే అనుమానం మొదలైంది. అయితే.. ఈవిషయం తెలుసుకున్న అఖిల్ సాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమారుడు ఉన్నతంగా బతకాల్సిన వాడు ఉలుకూ పలుకూ లేకుండా పోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తనకుమారుడు అఖిల్ సాయి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో ప్రాణాలు విడిచిన అఖిల్ సాయిపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన ఆయన తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే అఖిల్ సాయి మృతదేహాన్ని తెలంగాణకు తెప్పించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
We will do our best to help the bereaved family @KTRoffice please contact and assist https://t.co/Zaz3CCxjZ7
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
— KTR (@KTRBRS) February 7, 2023
Read also: Harassment: మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య.. దానివల్లే అంటూ ఆరోపణ
ఏం జరిగిందంటే.. అమెరికాలోని అలబామా రాష్ట్రం ఆబర్న్ సిటీలో ఉంటున్న 25 ఏళ్ల మహాంకాళి అఖిల్ సాయి అనే యువకుడు బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన అఖిల్ సాయి తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన వాడు. కాగా.. ఏడాది క్రితమే అతడు ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లాడు. అఖిల్ అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. అక్కడ అలబామాలోని మోంట్ గోమెరీలో గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే సోమవారం రాత్రి డ్యూటీ చేస్తున్న టైంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే.. సెక్యూరిటీ గార్డు చేతిలో ఉన్న తుపాకీ తీసుకొని పరిశీలించబోయాడని ఆ గన్ మిస్ ఫైర్ అయిందని ప్రచారం జరిగింది. కాగా.. అఖిల్‌సాయి స్నేహితుడిని ఒకరిని అరెస్టు చేశారని ప్రచారం కూడా జరుగుతుండటం.. రవితేజ అనే స్నేహితుడే కాల్పులు జరిపాడని ప్రచారం నడుస్తోంది దీనిపై పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా.. కాల్పుల్లో బుల్లెట్ అఖిల్ సాయి శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే గ్యాస్ స్టేషన్ సిబ్బంది ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. అఖిల్ చికిత్స పొందుతూ అఖిల్ సాయి చనిపోయాడు. దీంతో అఖిల్ సాయి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
Horrible incident: రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య.. కారణం ఏంటంటే..
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!