Site icon NTV Telugu

Tummala Nageswara Rao : న్యాయం కోసం తప్పా నేను దేనికి లొంగను

Minister Tummala

Minister Tummala

Tummala Nageswara Rao : వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు రైతుల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచాయి. ప్రస్తుతంగా రైతుల అవసరాలపై, పథకాల అమలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలనకు వస్తే, ప్రభుత్వం రైతుకు తోడుగా నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. రైతుల రుణ భారం తగ్గించేందుకు పాత రుణాల మాఫీ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. “రైతు బంధు పేరుతో గతంలో అన్ని పథకాలు ఆపేశారు. కానీ ఇప్పుడు అన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి నేరుగా వెళ్లింది రూ.36,000 కోట్లు” అని వెల్లడించారు.

విత్తనాల విషయంలో నకిలీ విత్తనాలను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నకిలీ విత్తనాల విషయంలో పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల విషయంలో షిప్ రాకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అన్ని జబ్బులకూ కారణం యూరియా. కేంద్రానికి కూడా సలహా ఇచ్చాను. యూరియా తగ్గిస్తే మన పంటలకు ప్రపంచ మార్కెట్ లో విలువ పెరుగుతుందని అన్నారు.

Plane Crash: విమాన ప్రమాద దర్యాప్తులో అమెరికా ఎందుకు పాల్గొంటోంది?

డ్రై ల్యాండ్ పంటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు, గతంలో ఇచ్చినట్లే ఇప్పుడు కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. తోటలు వేసిన రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చే యోచనలో ఉన్నామన్నారు. పెంచిన మద్దతు మొత్తం రూ.6,000. మునుపు రూ.5,000 ఇస్తే, ఇప్పుడు పెంచాం అని తెలిపారు.

పామాయిల్ ఉత్పత్తిపై ప్రాముఖ్యత పెరుగుతోంది. “కొణిజర్లలో రిఫైనరీ, సీడ్ గార్డెన్ ఏర్పాటు అవుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేనిది. వచ్చే సీజన్‌కు వెంసూర్, కొణిజర్ల ఫ్యాక్టరీలు సిద్ధం చేస్తాం” అని వెల్లడించారు. తెలంగాణలో మినిమం గ్యారెంటీ ప్రైస్ ఉండాలని కోరారు. సౌత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధానిని కలిసి ఒత్తిడి తీసుకురాగలమని భావిస్తున్నాం అని తెలిపారు. తెలంగాణ వరి ఉత్పత్తిలో టాప్ లో ఉందని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ ఆరోపణలపై స్పందిస్తూ, “కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు, కానీ అభివృద్ధి జరగాలి” అని అన్నారు. అలాగే మార్కెట్ చైర్మన్ నియామకం ఎమ్మెల్యే పరిధిలో జరిగిందని పేర్కొన్నారు.

Boeing: బోయింగ్‌ని ముందే హెచ్చరించిన మాజీ ఉద్యోగి.. ఆ తర్వాత అనుమానాస్పద మృతి..

Exit mobile version