Weather Updates : గత మూడు రోజుల నుంచి రెండు విభిన్నమైన వాతావరణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. 40 నుంచి 41 సెల్సియస్ ఉష్ణోగ్రత గత వారం రోజులు బట్టి ఉంటుంది. దీంతో రోడ్ల పైన జనం తిరగటానికి ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండల దాటికి తట్టుకోలేకపోతున్నారు. జాతీయ రహదారుల్లో వాహనాల రొద కూడా కనపడటం లేదు .ఇక పోతే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. గాలి దుమ్ము, వర్షం, వడగండ్లు కురుస్తున్నాయి. దీంతో ప్రజానీకం పగటిపూట ఉక్క పోత రాత్రిపూట గాలుల వల్ల కరెంటు పోతుండడం తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య 8 బంతులే ఆడాడు.. పంజాబ్ కోచ్ ఆసక్తికర విశేషాలు!
ఇదిలా ఉండగా… భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా వడగండ్ల వానల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. అశ్వరావుపేట, నియోజకవర్గం లోని అశ్వరావుపేట, దమ్మపేట, మణుగూరు, సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో అటు వడగండ్ల వానతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు వడగండ్లు వస్తున్నాయి అదేవిధంగా అశ్వరావుపేట నియోజకవర్గంలో గాలి దుమ్మకి కరెంటు స్తంభాలు కూడా కూలిపోయాయి. దీంతో వడగండ్ల వల్ల మామిడి పంట తీవ్రంగా దెబ్బ తింటుంది. మామిడిపండు పై వడగండ్లు పడటంతో పగిలి పోతున్నాయి మే నెలకి రావలసిన మామిడి పంట ఇప్పుడే తీవ్రంగా దెబ్బతింటు న్న దని రైతులు ఇప్పుడే మామిడి పంటను ముందస్తుగా తెంపుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు మరోవైపు మార్కెట్ సమస్య కూడా రైతులను వేధించుతుంది.
PBKS vs CSK: ప్రీతి జింటా సెలబ్రేషన్స్.. ఎంఎస్ ధోనీ సీరియస్ లుక్!