Site icon NTV Telugu

Chandigarh: పంజాబ్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది సహచరుడి అరెస్టు

Terrorist

Terrorist

చండీగఢ్లోని అమృత్‌సర్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడ్ సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలోని ‘మోస్ట్ వాంటెడ్’ నేరస్థులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు రోడ్.. కాగా లఖ్‌బీర్ సింగ్ పాకిస్తాన్‌లో గుండెపోటుతో మరణించాడు. అతని సహచరుడు పరమజీత్ సింగ్ అలియాస్ ధాదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Read Also: Skin Care : మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి..

పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర విధ్వంసక కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ISYF (ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్) చీఫ్ లఖ్‌బీర్ రోడే సహచరుడు ధాదీ అని యాదవ్ చెప్పాడు. అంతేకాకుండా.. ఉగ్రవాద నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు దర్యాప్తు జరుగుతోందని పోలీసు చీఫ్ చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న తీవ్రవాద మాడ్యూల్‌కు పరమజీత్‌ అరెస్ట్‌ పెద్ద దెబ్బ అని ఆయన అభివర్ణించారు.

Read Also: Sukhdev Singh Gogamedi: “కర్ణి సేన” అధినేత దారుణ హత్య.. దుండగుల కాల్పుల్లో మృతి

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో లఖ్‌బీర్ సింగ్ రోడ్ గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమం వెనుక రోడే.. ఉన్నారని గౌరవ్ యాదవ్ చెప్పారు. భింద్రన్‌వాలే మరణానంతరం పాకిస్తాన్ పారిపోయి లాహోర్‌లో స్థిరపడ్డాడు. అయితే అతను.. సోమవారం మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోందని అన్నారు. రోడ్ ‘ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్’ నాయకుడు అని పోలీసులు చెప్పారు.

Exit mobile version