పొత్తులో భాగంగా టీడీపీ హైకమాండ్‌కు వివిధ జిల్లాల్లోని కీలక సెగ్మెంట్లు సంకటంగా మారుతున్నాయి. పెందుర్తి, రాజమండ్రి రూరల్, పిఠాపురం, కాకినాడ, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమం, తెనాలి సెగ్మెంట్లపై టీడీపీ ఏటూ తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నేతలు రోజురోజుకూ ఒత్తిడి పెంచుతున్నారు. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ టీడీపీ అధిష్టానానికి పశ్చిమ నేతల వినతులు ఇస్తున్నారు. విజయవాడ పశ్చిమం నుంచి బీసీ వర్గానికి చెందిన బుద్దా వెంకన్న టిక్కెట్ ఆశిస్తున్నారు. కాగా.. రేసులో మైనార్టీ వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ ఉన్నారు.
MP Balasouri: పవన్‌తో ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యాను..
మరోవైపు.. వైశ్య సామాజిక వర్గం కోటాలో డూండీ రాకేష్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. టిక్కెట్ తమకే కేటాయించాలంటూ జనసేన పట్టు పడుతోంది. దీంతో.. టీడీపీకి విజయవాడ పశ్చిమ టిక్కెట్ సంక్లిష్టంగా మారుతోంది. అటు తెనాలిలో కూడా.. నువ్వా-నేనా అంటూ టీడీపీ, జనసేన సిగపట్లు పడుతుంది. రాజమండ్రి రూరల్ తనకేననే ధీమాతో గోరంట్ల బుచ్చయ్య.. అదే భరోసాతో జనసేన నేత కందుల దుర్గేష్ ఉన్నారు. కాకినాడ అర్బన్ టిక్కెట్ కోసం టీడీపీ నేత కొండబాబు, జనసేన నుంచి ముత్తా శశిధర్ మధ్య పోటీ నెలకొంది. ఇటు కాకినాడ రేసులో జనసేన తరపున ముద్రగడ ఉన్నారు. టీడీపీ – జనసేన మధ్య పిఠాపురం పీటముడి ఉంది. అలాగే.. పెందుర్తిలో టీడీపీ బండారు వర్సెస్ జనసేన పంచకర్ల మధ్య పోటీ నెలకొంది.
Ram Mandir Holiday: రామ మందిర వేడుక రోజు ఏ రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి..? ఏ సంస్థలకు హాలిడే..?