Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Key Points In Sajjala Sreedhar Reddy Remand Report In Ap Liquor Scam Case

AP Liquor Scam: సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Published Date :April 26, 2025 , 5:56 pm
By Sudhakar Ravula
  • సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..
  • కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి సన్నిహిత సంబంధాలు..
  • లిక్కర్ స్కాంలో ముడుపులు సిండికేట్ కు అందించడంలో కీలక పాత్ర..
AP Liquor Scam: సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసు సంచలనంగా మారింది.. ఈ కేసులో A6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు.. లిక్కర్ స్కాం లో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. నిన్న సాయంత్రం శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి అధికారులు విచారించారు. మద్యం అమ్మకాలు, లావా దేవీలలో శ్రీధర్ రెడ్డి పాత్ర పై అధికారులు విచారణ జరిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపి కోర్టులో హాజరు పరచగా కోర్టు వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది. శ్రీధర్ రెడ్డిని పోలీసులు విజయవాడ సబ్ జైలుకి తరలించారు.. అయితే, సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి..

Read Also: Ram : రామ్ కోసం రంగంలోకి క్రేజీ హీరో..?

ఏపీ లిక్కర్‌ కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి సన్నిహితుడుగా ఉన్నారు.. లిక్కర్ స్కాంలో ముడుపులు సిండికేట్ కు అందిచడంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్‌.. ప్రముఖ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అనిచివేయటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు.. చట్ట విరుద్ధంగా లిక్కర్ ఆర్థర్ ఫర్ సప్లై (OFS) జారీ చేశారట.. మద్యం తయారీ, హోల్ సేల్, రిటైల్ ను ముడుపులు తీసుకొని నియంత్రించటం.. డిస్టలరీస్ ను సమన్వయం చేసి సకాలంలో సిండికేట్ సభ్యులకు ముడుపులు అందేలా చర్యలు తీసుకున్నారని శ్రీధర్‌రెడ్డిపై అభియోగాలు మోపారు.. కేసులో ఇతర నిందితులు వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ లకు నచ్చిన కంపెనీలకు ఆర్థర్ ఫర్ సప్లై జారీ చేశారని సిట్‌ పేర్కొంది.. ముడుపులు, కమిషన్ ద్వారా డబ్బు ఎలా సేకరించారు, ఏ కంపెనీలకు మళ్లించారు, ఆ డబ్బు ఎలా వినియోగించారు అనే వివరాలు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నాయని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్‌..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Liquor Scam
  • AP Liquor Scam Case
  • Sajjala Sreedhar Reddy
  • Sajjala Sreedhar Reddy remand report

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions