NTV Telugu Site icon

Patnam Narender Reddy : పట్నం నరేందర్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు

Patnam Narender Reddy

Patnam Narender Reddy

Patnam Narender Reddy : లగచర్ల ఘటనలో కలెక్టర్ పై దాడికి కుట్ర చేశారన్న అభియోగాలపై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలోనే నరేందర్ రెడ్డిని పోలీసులు విచారణ అనంతరం కొడంగల్ కోర్టుకు తరలించారు. పోలీసులు కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరిచగా… కోర్టు నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే.. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించామని, నిందితుడు విశాల్‌ తోపాటు గ్రామం లో కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గా తేలిందని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ది కీలక పాత్ర గా తేలిందని, హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్ల కు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టాడని పోలీసులు తెలిపారు. నిందితుడు బోగమోని సురేష్‌ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్‌వాష్‌ చేయించాడని, నిందితులకు ఆర్థిక, నైతిక సహాయంతో సహా అన్ని సౌకర్యాలను అందించాడన్నారు.

Fire Accident In Train: గ్యాస్ లీకేజీ కావడంతో.. ఆగి ఉన్న రైల్వే కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం

ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడానికి నిందితుల దృష్టిని మళ్లించాడని, భూసేకరణ సమయంలో సర్వే లేదా పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని.. లేకపోతే మీ భూములు మీకు దక్కవని రెచ్చగొట్టాడన్నారు నరేందర్‌ రెడ్డి. అన్ని రకాల మద్దతు ఉంటుందని… తమ పార్టీ ప్రముఖ నేత మిమ్మల్ని ఆదుకుంటారని రైతులకు, నిందితుడు సురేష్‌ కు హామీ ఇచ్చాడు నరేందర్ రెడ్డి.. పట్నం నరేందర్ రెడ్డి నేరపూరిత కుట్రను రూపొందించాడని.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డారని రిమాండ్‌ రిపోర్ట్‌లో పొందుపరిచారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం 07:02 గంటలకు హైదరాబాద్‌ లో అదుపులోకి తీసుకున్నామని, విచారణలో నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడ్డానని నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడని, నిందితుడు సురేష్‌ను ఫోన్‌లో తరచుగా సంప్రదించి వారి చర్యలను అంచనా వేసినట్లు కూడా ఒప్పుకున్నాడని పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Champions Trophy 2025: ప్రపంచ పోటీలను నిర్వహించే హక్కును భారత్, పాకిస్థాన్‭కు ఇవ్వకూడదంటున్న మాజీ క్రికెటర్

Show comments