Site icon NTV Telugu

Vizag: తహసీల్దార్ రమణ కేసులో కీలక ఆధారాలు లభ్యం..

Mro

Mro

విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. రుషికొండలోని అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ లను 22ఏ నుంచి తప్పించేందుకు ఎమ్మార్వోతో మణికంఠ గంగారాం ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం మేరకు ఎమ్మార్వో, రియల్టర్ గంగారాం మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ఇరువురి మధ్య రుషికొండ అపార్ట్మెంట్స్ తో పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు జరిగాయి.

Pawan Kalyan: సిద్ధం అని రాష్ట్రం అంతా పోస్టర్లు వేస్తున్నారు.. దేనికి సిద్ధం..?

అయితే కొన్నింటిలో ఎమ్మార్వోను బెదిరించైనా పనులు చేయించాలని ప్రణాళిక ప్రకారం రాడ్ తీసుకెళ్లాడు గంగారాం. ఘటనకు పాల్పడే సమయంలో మొబైల్ లో రెగ్యులర్ సిమ్ కాకుండా వేరే సిమ్ తో ఎమ్మార్వో డ్రైవర్ తో గంగారాం టచ్ లో ఉన్నాడు. విజయనగరం నుంచి ఎమ్మార్వో రమణయ్య వచ్చే సమయాన్ని డ్రైవర్ ద్వారానే తెలుసుకున్నాడు. ప్రస్తుతం హంతకుడు నాలుగు సిమ్ లు వాడుతున్నట్లు గుర్తించారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఫ్లైట్ లో వెళ్లినట్టు సాంకేతిక ఆధారాలు లభించాయి. కాగా.. బెంగుళూర్, చెన్నైలో గంగారాం ఆచూకీ కోసం 10 టీమ్ ల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. హంతకుడు దొరికితే హత్యకు దారి తీసిన పరిస్థితులపై మరింత సమాచారం వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Balashowry: దమ్ము ధైర్యంతో ప్రశ్నించే నాయకుడు పవన్ కల్యాణ్..

కాగా.. ఇటీవలే ఎమ్మార్వో రమణయ్య విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. అయితే విశాఖ కొమ్మాదిలోని ఓ అపార్ట్ మెంట్‌లో నివాసముంటున్నారు. శుక్రవారమే బొండపల్లిలో ఎమ్మార్వోగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి ఫోన్ రావడంతో ఆయన అపార్ట్ మెంట్ నుంచి కిందకి వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై దుండగులు ఇనుపరాడ్‌తో దాడి చేశారు. దీంతో ఎమ్మార్వో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు.

Exit mobile version