NTV Telugu Site icon

Muchumarri Missing Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక పరిణామం..

Muchumarri

Muchumarri

Muchumarri Missing Girl Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ముచ్చుమర్రి బాలికపై హత్య, అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ముచ్చుమర్రి శివారులో ఒక ప్రదేశంలో జేసీబీతో ముల్లచెట్లను తొలగిస్తున్నారు పోలీసులు.. మైనర్ బాలురు చూపించిన రెండు ప్రదేశాల్లో ఒక ప్రాంతంలో చెట్లను తొలగించారు.. దీంతో, బాలిక మృతదేహాన్నరి ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. అయితే, ఈ పరిణామాలతో బాలిక కేసు ఎప్పుడు ఎటు మలుపుతీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.. మరోవైపు.. బాలిక మృతదేహం ఆచూకీ కనుక్కోవాలంటూ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగుతున్నారు.. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశామని పోలీస్ దర్యాప్తులో ముగ్గురు మైనర్ బాలురు అంగీకరించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. వారు ఇచ్చిన సమాచారం మేరకే బాలిక మృతదేహాన్ని వెతికే పనిలోపడిపోయారు.

Read Also: Road Accident: హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు లారీలు ఢీ, ఒకరు మృతి

ఇక, అత్యాచారం, హత్యకు గురైన బాలిక బంధువులు ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.. 6 రోజులైనా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో రోడ్డెక్కారు బంధువులు.. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఎత్తిపోతల కాలువలో పడేసామని మైనర్ బాలురు చెప్పడంతో 4 రోజులుగా కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.. బాలిక మృతదేహం దొరకకపోవడంతో బంధువుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బాలిక మృతదేహాన్ని వెంటనే గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, 4 రోజులుగా బాలిక మృతదేహం కోసం ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్ లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. మకోవైపు.. ముగ్గురు మైనర్ బాలురను ముచ్చుమర్రి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు పోలీసులు.. రెండు వేర్వేరు స్థలాలను పోలీసులకు బాలురు చూపించారు.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. బాలురు చూపించిన స్థలాల్లో ఏమైనా పూడ్చిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ ఘటనలో బాలుర పాత్ర మాత్రమేనా, ఇంకా ఎవరిపాత్ర అయినా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ తరుణంలో.. జేసీబీతో ముల్ల పొదలను తొలగించడంతో.. అక్కడే మృతదేహాన్ని పాతిపెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.