యాలకులలో విటమిన్ B6, విటమిన్ B3, విటమిన్ C, జింక్, కాల్షియం, పొటాషియం అలాగే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఎక్కువగా ఉన్నాయి.

లైంగిక సమస్యల నుంచి ఉపశమనం: ఏలకులు పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి లైంగిక సమస్యలను నివారిస్తాయి.. 

ఇంకా లైంగిక జీవితంలో తాజాదనాన్ని తీసుకువస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఏలకులు తినడం వల్ల లైంగిక జీవితం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఏలకులు బరువు తగ్గడానికి సహాయపడే అనేక అంశాలను కలిగి ఉంటాయి.  

మీ ఆహారంలో ఏలకులను చేర్చుకోవడం ద్వారా.. వేగంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

 యాలకులలోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.

క్యాన్సర్ ను నివారిస్తాయి: ఏలకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నోటి క్యాన్సర్, చర్మ క్యాన్సర్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయి.

అధిక రక్తపోటును నియంత్రించడంలో పచ్చి ఏలకులు మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్త ప్రసరణను సాధారణీకరించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్ మూలకాలను కలిగి ఉంటాయి.

ఏలకులు వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. రాత్రిపూట వీటిని తీసుకోవడం వలన జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. 

రాత్రిపూట నీళ్లలో ఏలకులను వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే త్వరగా ఉపశమనం పొందవచ్చు.