Site icon NTV Telugu

World Cup Final 2023: ఫైనల్ పోరులో కీలక మార్పులు.. ఆ ఆటగాడికి ఛాన్స్..!

Ashwin

Ashwin

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. రేపు జరగనున్న టైటిల్ పోరులో ఇండియా-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కావున.. టైటిల్ గెలుచుకోవాలనే ఆశతో భారత్ ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా టైటిల్ గెలిచి వరల్డ్‌కప్‌ చరిత్రను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది.

Hardik Pandya: ఎంతో మంది భారతీయుల కల.. కప్‌ గెలవాలి..

ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియాలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఒక మార్పుతో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ స్ధానంలో వెటరన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అవకాశమివ్వాలని టీమిండియా మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాపై అశ్విన్‌కు మంచి రికార్డు ఉండడంతో తుది జట్టులోకి తీసుకురావాలని హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

World Cup Final: ఫైనల్ మ్యాచ్కు వెళ్లే ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఢిల్లీ టూ అహ్మదాబాద్‌ స్పెషల్ ట్రైన్

మరోవైపు.. ఆర్.అశ్విన్‌ ఈ టోర్నీలో కేవలం ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. లీగ్‌ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌ ఆడగా.. ఈ మ్యాచ్‌లో అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. 8 ఓవర్లు వేసిన అశ్విన్.. 34 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తీశాడు. ఈ క్రమంలో మరోసారి అతడి అనుభవాన్ని ఊపయోగించుకోవాలని టీమిండియా మేనెజ్‌మెంట్‌ ఆలోచిస్తోంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు అశ్విన్‌ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీంతో అతడు ఫైనల్‌ మ్యాచ్‌కు తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.

ఫైనల్‌ మ్యాచ్ భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌

Exit mobile version