Site icon NTV Telugu

Team India: ప్రపంచకప్ గెలవడంతో జెర్సీలో కీలక మార్పు..

Team India

Team India

జూలై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు పల్లెకెలెలో జరగనున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా జెర్సీలో భారీ మార్పు జరిగింది. ఇప్పటికే శ్రీ‌లంక చేరుకున్న టీమిండియా.. నెట్స్ ప్రాక్టీస్లో దూకుడు పెంచారు. సూర్యకుమార్ యాద‌వ్ బృందం ఆతిథ్య జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉంద‌న‌గా భార‌త ఆట‌గాళ్లు కొత్త జెర్సీల‌తో ఫొటోల‌కు పోజిచ్చారు.

Hasini Sudhir: రాజ్ తరుణ్ తో కలిసి నటించడం హ్యాపీ.. “పురుషోత్తముడు” హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పేస‌ర్లు మ‌హ్మద్ సిరాజ్, ఖ‌లీల్ అహ్మద్‌లు రెండు స్టార్లతో కూడిన జెర్సీ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ జెర్సీపై రెండు నక్షత్రాలు ఉన్నాయి. మొన్న గెలిచిన వరల్డ్ కప్ ట్రోఫీతో మరో స్టార్ జెర్సీపై ముద్రించారు. ఇంతకుముందు ఒక వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొందగా.. తాజాగా కరేబియన్ గడ్డపై సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ సాధించింది టీమిండియా. ఈ క్రమంలో.. రెండు విజయాలకు గుర్తుగా మరో స్టార్ ను జెర్సీపై యాడ్ చేశారు. లంకేయులతో జరుగనున్న టీ20 సిరీస్‌లో టీమిండియా టూ స్టార్ జెర్సీని ధ‌రించి బరిలోకి దిగనుంది. కాగా.. ఇంతకముందు ఎంఎస్ ధోని సారథ్యంలో 2007లో భారత్ ఛాంపియన్ అవతరించింది. అప్పుడు జెర్సీపై ఒక స్టార్ ఉంది. తాజాగా రోహిత్ సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ గెలుపొందగా మరో స్టార్ను ముద్రించారు. అయితే.. ఈ స్టార్ ను తెచ్చిపెట్టిన రోహిత్, విరాట్ కోహ్లీ ఈ జెర్సీలు ధరించలేరు. ఎందుకంటే.. వారు టీ20 వరల్డ్ కప్ గెలవగానే టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించారు.

UPSC Changes Exam Pattern: ఆ మోసాలకు చెక్ పెట్టేందుకు యూపీఎస్సీ పరీక్షా విధానంలో కీలక మార్పులు..

Exit mobile version