సౌత్ ఇండస్ట్రీలో హోమ్లీ లుక్కులో కనిపించిన భామలు కొందరు బాలీవుడ్ వెళ్లాక గ్లామర్ డోర్స్ తెరిచేస్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్ కీర్తి సురేష్. మహానటిగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన కీర్తి ఇక్కడ ఉన్నంత సేపు నో గ్లామర్, నో లిప్ కిస్ ఫార్ములాతో కెరీర్ నడుపుకొచ్చింది. ఎప్పుడైతే బాలీవుడ్ బాట పట్టిందో మేడమ్ రెచ్చిపోయింది. వరుణ్ ధావన్ బేబిజాన్‌లో ఎన్నడూ చూడని కీర్తిని చూసి అవాక్కయ్యారు సౌత్ ఆడియన్స్.
Also Read : SalmanKhan : అరుదైన వ్యాధితో బాధపడుతున్న సల్మాన్ ఖాన్
బేబి జాన్‌లో మాత్రమే కాదు బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో కూడా సీరియస్ ప్లస్ గ్లామరస్ లుక్కులోనే కనిపించబోతోందని టాక్. ఫస్ట్ లుక్ వచ్చి ఏడు నెలలౌతున్నాఈ వెబ్ సిరీస్ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ లేదు. కానీ సౌత్‌లో మాత్రం అదే హోమ్లీ లుక్ మెయిన్ టైన్ చేస్తోంది. అయితే ఇకపై ఇక్కడ కూడా మారబోతున్నట్లు టాక్. విజయ్ దేవరకొండ రౌడీ జనార్థనలో కీర్తి ఫైనల్ అయ్యిందని బజ్. ఇందులో కాస్త హద్దులు దాటబోతోందట. విజయ్ దేవరకొండతో కీర్తి లిప్ సీన్స్‌లో నటించబోతున్నదన్న న్యూస్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. యాక్చువల్లీ ఈ ఆఫర్ తొలుత రుక్మిణీ వసంత్ వద్దకు వచ్చిందట. ఇప్పటి వరకు గ్లామర్ రోల్ చేయని రుక్మిణీకి లిప్ కిస్ అనగానే ఆఫర్ వదిలేసుకున్నట్లు సమాచారం. అయితే కీర్తి మాత్రం ఎలాంటి అభ్యంతర చెప్పకుండానే ఈ మూవీకి సైన్ చేసిందన్న వార్తలొస్తున్నాయి. పెళ్లయ్యాకే కీర్తి ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యమే. దసరా రోజు గ్రాండ్ గా స్టార్ట్ కాబోతున్న రౌడీ జనార్దన లో కీర్తి సురేష్ ఎలాంటి అందాలు ఆరబోస్తుందో.
