ఈ మధ్య వరుసగా కీర్తి సురేష్ గురించి రూమర్స్ వస్తున్నాయి.తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.డానికి కారణం ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ అని తెలుస్తుంది..కీర్తి సురేష్ నటిస్తున్న రీసెంట్ మూవీ మామన్నన్. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తుండగా ఈ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటిస్తుంది.వడివేలు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.. జూన్ 29న మామన్నన్ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. మామన్నన్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన్నట్లు సమాచారం..మామన్నన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు.మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా అని ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది.. ఈ విషయం పై ఆలోచించాలి అని ఆమె సమాధానం ఇచ్చారు..
కీర్తి చేసిన ఆ కామెంట్ తో భవిష్యత్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఆమెకు పాలిటిక్స్ ఆసక్తి ఉందని తెలుస్తుంది.ఇంతకు ముందు కూడా కీర్తి సురేష్ బీజేపీలో జాయిన్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. ఆ వార్తలు నిజం కాదని కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ చెప్పుకొచ్చారు.. మరి భవిష్యత్ లో కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.తెలుగులో కీర్తి సురేష్ దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.. దసరా సినిమా వంద కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. నాని హీరోగా తెరకెక్కిన దసరా మార్చి 30న విడుదలై భారీ విజయం నమోదు చేసింది..ఇంతకు ముందు మహేష్ కి జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా ఆమె కు మంచి విజయాన్ని అందించింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూనే కీర్తి సౌత్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో సిస్టర్స్ రోల్స్ కూడా చేస్తుంది.. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి తాజాగా భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్నారు.