NTV Telugu Site icon

KCR : అన్నదాతల చెంతకు గులాబీ బాస్

Kcr Birthday Celebretions

Kcr Birthday Celebretions

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల ఎకరాల్లో పంటలకు నష్ట వాటిల్లింది. అయితే.. ఈ నేపథ్యంలోనే రంగంలోకి గులాబి బాస్‌ దిగనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల చెంతకు కేసీఆర్‌ రానున్నారని, ఎండిన పంటలను కేసీఆర్‌ పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో కేసీఆర్‌ పర్యటిస్తారని ఆయన తెలిపారు.

Prakash Raj:ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు… వైరల్ అవుతున్న వీడియో..!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు నేరుగా కేసీఆర్ రానున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ మొదటి వారం తరువాత కేసీఆర్‌ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలిస్తారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే రూట్ మ్యాప్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రెడీ చేస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజ కవర్గ పరిధిలో పర్యటించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. గడిచిన పది సంవత్సరాలలో ఎండిపోని పంట పొలాలు, ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయో కేసీఆర్ అరా తీసినట్లు, అత్యధికంగా బోర్లు వేసి నష్ట పోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే ఈ పరిశీలన మొదలు పెట్టే విధంగా కార్యక్రమం రూపొందిస్తుంది బీఆర్‌ఎస్‌.

US: అమెరికాలో ఘోర ప్రమాదం.. కంటైనర్ షిప్ ఢీకొని కూలిన బ్రిడ్జి