NTV Telugu Site icon

Harish Rao: కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం

Minister Harish Rao

Minister Harish Rao

Harish Rao: కేసీఆర్‌పై నమ్మకం, మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయని మంత్రి హరీశ్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి పేర్కొన్నారు. నాకు నేను ట్రబుల్‌ షూటర్‌ అని ఎప్పుడూ చెప్పుకోలేదని.. హరీశ్ రావు ఏనాడు కేసీఆర్‌ మాట జవ దాటలేదన్నారు. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారని మంత్రి స్పష్టం చేశారు. మా ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన వెల్లడించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను పాటిస్తానని చెప్పుకొచ్చారు. తెలంగాణ జాతి గౌరవాన్ని కేసీఆర్‌ పెంచారని.. మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్నారు మంత్రి హరీశ్‌ రావు. ఎన్డీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి హరీశ్ కీలక వివరాలను వెల్లడించారు.

11 సార్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని.. కానీ బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదు, ప్రజలు లాక్కున్నారన్న మంత్రి హరీశ్.. తెలంగాణ ఇవ్వకుండా 5ఏళ్లు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణకే మేలు అన్న మంత్రి హరీశ్.. మహారాష్ట్ర రైతులు తెలంగాణ పథకాలు కావాలంటున్నారన్నారు. తెలంగాణ జాతి గౌరవాన్ని కేసీఆర్‌ పెంచారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. మా సిద్ధాంతాలతో కలిసి వస్తే ఎవరినైనా కలుపుకుని వెళ్తామని మంత్రి హరీశ్‌ చెప్పారు. దేశంలో అత్యధికంగా వేతనాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులేనని.. వేతనాలు ఆలస్యంగా రావడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం రావడం, కరోనా మహమ్మారి వల్ల ఆదాయం తగ్గి, కేంద్రం పక్షపాతం వల్ల ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కాస్త ఆలస్యం అవుతోందన్నారు. తెలంగాణ అనుకున్న లక్ష్యం సాధించింది. కొత్త ప్రాజెక్టు కట్టాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం. మన తలసరి ఆదాయం పెరిగిందన్నారు మంత్రి హరీశ్.

Also Read: Bandi Sanjay: నన్ను ఓడించేందుకు సీఎం రూ. వెయ్యి కోట్లు గంగులకు పంపించాడు..

మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. ‘టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ప్రకటన దురదృష్టకరం.. టీఎస్‌పీఎస్సీ లీకేజీని ప్రభుత్వమే గుర్తించింది.. పారదర్శకంగా రిక్రూట్‌మెంట్లను పూర్తి చేశాం.. భవిష్యత్‌లో కూడా రిక్రూట్‌మెంట్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తాం.. జాబ్‌ క్యాలెండర్‌ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది ఉద్యోగ నియామకాలు చేపడతాం. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది.. రైతుబీమా, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేశాం. ఇవే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.’ అని ఆయన తెలిపారు గతంలో ఇచ్చిన దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి హామీ గురించి మంత్రి హరీశ్ రావు స్పష్టత ఇచ్చారు. భూలభ్యత లేని కారణంగా దళితబంధు లాంటి పథకం తీసుకొచ్చామన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదని ఆయన కాంగ్రెస్‌ను విమర్శించారు. భూముల అమ్మకాలపై మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మలేదా? అంటూ ప్రశ్నించారు.

Also Read: BRS MPs: బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్‌ నోటీసులు

బీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లకే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు ఇస్తున్నారనేది తప్పుడు ప్రచారమని.. అన్ని పార్టీల వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారికే దళితబంధు పథకం ఇవ్వడం లేదని.. అందరికీ రాజకీయాలకు అతీతంగా అందజేస్తున్నామన్నారు. పనితనమే తప్ప పగతనం తెలియని నాయకుడు కేసీఆర్‌.. మేము అభివృద్ధిపై మాత్రమే దృష్టి సారిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతుబంధు అందిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన కోదండరాం బీఆర్‌ఎస్‌తో ఎందుకు లేరనే ప్రశ్నపై మంత్రి హరీశ్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ పోరాటంలో ఉన్న కోదండరాం ప్రస్తుతం ఎవరితో జతకట్టారో చూడాలని మంత్రి పేర్కొన్నారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌ రెడ్డితో ఆయన జతకట్టారని ఆయన చెప్పారు.

కేసీఆర్‌ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూలేదు.. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించడం అవసరమా అంటూ ప్రశ్నించారు. రేవంత్‌ ఆనాడు సోనియాను బలిదేవత అనలేదా అంటూ ప్రశ్నించారు. ఇవాళ సోనియా రేవంత్‌కు దేవత అయిందా అంటూ ప్రశ్నలు గుప్పించారు. కుర్చీ కోసం రేవంత్‌ ఏమైనా మాట్లాడతారన్నారు. వ్యవసాయం గురించి అవగాహన లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. మూడెకరాలు పారేందుకు 3 గంటల కరెంట్‌ సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్, బీజేపీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ మేనిఫోస్టో బోగస్‌.. మా మేనిఫెస్టోనే కాంగ్రెస్‌ కాపీ కొట్టింది.. అధికారంలో వస్తామని కాంగ్రెస్‌ కలలు కంటోంది.. కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకున్నారని ఆయన విమర్శించారు.