NTV Telugu Site icon

KCR: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శనాస్త్రాలు..

Kcr

Kcr

కరీంనగర్ జిల్లా కదనభేరి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బు లేకున్నా రైతుబంధు ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా తాము అభివృద్ధిపై పోరాడుతామని తెలిపారు. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా.. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి..? అని ప్రశ్నించారు. ఐదు రూపాయల పని చేయని బండి సంజయ్ కి ఎందుకు ఓటెయ్యాలి..? అని ప్రశ్నించారు. తెలంగాణాలో వ్యవసాయ స్థిరీకరణ చేయాలని ఆలోచించాం.. చరణ్ సింగ్ లాంటి రైతుబిడ్డలు కూడా పెట్టని పథకాలు మనం రైతుల కోసం పెట్టుకున్నామన్నారు. ఈ విషయాలన్నీ కరీంనగర్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

Kidney Fraud: కిడ్నీకి రూ.2 కోట్లు వస్తాయని తెలిసి ఆ చార్టర్డ్ అకౌంటెంట్.. చివరకు..?!

అసమర్థ కాంగ్రెస్ నాయకుల పాలనలో బోనస్ బోగస్ గా మారిపోయిందని కేసీఆర్ ఆరోపించారు. మేడిగడ్డలో చిన్న కాంపోనెంట్ లో ఏదో జరిగితే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు.. రెండు పిల్లర్లు కుంగితే భారతే మునిగిపోతున్నట్టు బొబ్బలు పెడుతున్నారని పేర్కొన్నారు. నా కళ్ల ముందే నీళ్లు లేక, కరెంట్ లేక రైతులు పొలాలకు నిప్పు పెడుతున్నారు, పశువులను మేపుతున్నారు.. గ్రామాల్లో మీరంతా చర్చ పెట్టాలని కేసీఆర్ తెలిపారు.. బీఆర్ఎస్ తెలంగాణా గళం, దళం, బలం అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ను గెలిపిస్తే.. తాము రైతు బంధు వేయకున్నా, కరెంటు, నీళ్లు ఇవ్వకపోయినా గెలిపిస్తారని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటారన్నారు. కాంగ్రెస్ వాళ్ల నైజం అది.. మనం చూడని కాంగ్రెస్ ప్రభుత్వమా అని వ్యాఖ్యానించారు.

Ponnam Prabhakar: పలు కార్పొరేషన్లకు మంత్రి మండలి ఆమోదం..

నేను సీఎంగా ఉన్నప్పుడు.. ఒక్క ఎకరం అయినా ఎండిందా.. మరి ఇప్పుడు ఏం రోగం వచ్చిందని కేసీఆర్ దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్లు ఇసుక జారి కుంగిపోతే.. ఏదో ప్రపంచం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం ప్రాజెక్టులో 300 పిల్లర్లు ఉంటే అందులో రెండో మూడో కుంగిపోయాయి.. ఒక దిక్కు పంటలు ఎండిపోయి పంటలు రైతులు కాలబెట్టుకుంటున్నారు.. పశువులు మేపిస్తుంటే వాళ్ల గురించి పట్టించుకోకుండా.. మెడలో పేగులు వేసుకుంటా అని తిరుగుతున్నాడని సీఎం రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నో మంచి పనులు చేసినా ఆశకు పోయి ఓటేస్తే ఏమైంది.. వీపు సాఫయ్యిందని అన్నారు. మంచిగా వాళ్లు అధికారంలోకి వచ్చి ఢిల్లీకి సూటుకేసులు పంపడంలో బిజీ అయ్యారు.. మూడు నెలల్లో తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళతారా.. ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడతారా అని మండిపడ్డారు. తమాషాకు ఓటేయొద్దు.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.