NTV Telugu Site icon

KCR: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..

Kcr

Kcr

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు ఆంధ్రా పేపర్లు ఉద్యమాన్ని కింద మీద చేశారని ఆరోపించారు. వాళ్ళు అడిగితే ఒకటే మాట చెప్పినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళుతున్నా.. తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వస్తానని చెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పేద ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని తెలిపారు.

Barcode: నవజాత శిశువును విసిరేసిన తల్లి.. “బార్‌కోడ్” సాయంతో పట్టుకున్న పోలీసులు..

ప్రపంచంలో రైతు బంధు అనే పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టామన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే రైతు బంధు మరో వెయ్యి పెంచుదాం అనుకున్నామని కేసీఆర్ తెలిపారు. దళిత బంధు పథకంతో తెలంగాణలోనే హుజూరాబాద్ లో దళితులు సంపన్నులు అయ్యారని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజక వర్గానికి దోఖాలేదు ఇది టెంపరరీ సెట్ బ్యాక్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పీఎం నరేంద్ర మోడీ కూడా అసూయ పడే పెట్టుబడులు వచ్చాయన్నారు. నాలుగైదు నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కోసవెల్లె పరిస్థితి లేదని విమర్శించారు.

Brinda Karat: బీజేపీ ఊహలు గ్యాస్ బుడగల్లా ఉన్నాయి.. చివరకు పేలిపోక తప్పదు

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ తెలిపారు. ఇంత తొందర వ్యవస్థ ట్రాక్ ఎందుకు తప్పింది ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల ఫలితమేనని ఆరోపించారు. గోదావరి నీళ్లు కర్ణాటకకు ఇస్తా అన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి సప్పుడు చేయడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో మన ప్రభుత్వం లేనందుకు కేంద్రంలో మన ఎంపీలను గెలిపించండని కేసీఆర్ కోరారు. గతంలో ఉన్న కరీంనగర్ ఎంపీ తమలపాకు నమలడం తిట్ల పురాణం తప్పితే చేసిందేమీ లేదని విమర్శించారు. బస్సు యాత్రకు వచ్చిన ఆదరణ చూసి 48 గంటలు తన ప్రచారం ఆపారన్నారు. ఎంపీ ఎన్నికల తరువాత హుజూరాబాద్ నియోజక వర్గానికి వచ్చి అందరితో కలిసి పండుగ చేసుకొందామని కేసీఆర్ తెలిపారు.