NTV Telugu Site icon

KCR On Kavitha Arrest: కవిత అరెస్ట్పై స్పందించిన కేసీఆర్..

Kcr On Kavitha

Kcr On Kavitha

KCR on Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం తొలిసారి స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేనన్నారు. లిక్కర్ స్కామ్ పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు. బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దీంతో తాము బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామని తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Pottel Teaser : రా & రస్టిక్ కంటెంట్ తో ‘పొట్టేల్’.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్!

కాగా, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.. తాము గతంలో బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ చేశాం.. పోలీసులు బీజేపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే దుర్మార్గుడైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. బీఆర్ఎస్‌ పార్టీ మీద క‌క్ష కట్టారు అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ క‌విత‌పై ఎలాంటి కేసు లేదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులో ఇరికించార‌న్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారం చూపలేక పోయారన్నారు.