Site icon NTV Telugu

KCR: భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మని ఓదార్చిన మాజీ సీఎం కేసీఆర్..

Kcr

Kcr

KCR: మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా హరీష్‌రావు ఇంటికి చేరుకున్నారు. తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మకు ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి హరీష్‌రావుని కౌగిలించుకుని ఓదార్చారు.

READ MORE: Shreyas Iyer Health Update: శ్రేయస్‌ హెల్త్ అప్‌డేట్‌ ఇచ్చిన సూర్యకుమార్‌.. ఏం చెప్పాడంటే?!

అంతకు ముందు కేసీఆర్.. తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మరణ వార్త తెలిసిన వెంటనే హరీష్ రావుకు ఫోన్ చేసి పరామర్శించారు కేసీఆర్.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

READ MORE: Bollywood : సత్తా చూపించని టాలీవుడ్.. అదరగొట్టిన శాండిల్ వుడ్

మరోవైపు.. సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసమైన క్రిన్స్‌ విల్లాస్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.

Exit mobile version