NTV Telugu Site icon

KCR : నేను అగ్ని పర్వతంలా ఉన్నాను.. కేసీఆర్ హాట్ కామెంట్స్

Kcr

Kcr

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం జరిగింది. తెలంగాణ భ‌వ‌న్‌లో జరిగిన ఈ స‌మావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. అసెంబ్లీ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. నేను అగ్ని పర్వతంలా ఉన్నానని, రాజకీయ కక్షతోనే నా కూతురును జైళ్లో పెట్టారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. సొంత బిడ్డ జైళ్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆయన వ్యాఖ్యానించారు.

 
INDIA Bloc: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. ఉభయ సభల్లో రగడ తప్పదా?
 

ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని, నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని ఆయన కేసీఆర్‌ అన్నారు. పాలనపై దృష్టి పెట్టకుండా అభాసుపాలు చేసే పనిలో ఉన్నారని, శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ ఉన్న వాళ్ళు ఎన్నికలను చేస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారని, పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పట్టు సాధించ లేకపోయిందన్నారు సీఎం కేసీఆర్‌.

Off The Record: అటవీశాఖలో కొత్త పంచాయితీ.. మంత్రి కొండా వర్సెస్‌ ముఖ్య అధికారి..!