సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాధ సభలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి మెదక్ జిల్లా నాకు బలానిచ్చింది అన్నారు. మెతుకు సీమలో ఏడూ ఎమ్మెల్యేలు గెలిపించిన నా జిల్లాకి చేతులెత్తి మొక్కుతున్నాను.. BRSకి ఓట్లెందుకు సీట్లెందుకు అని కొంతమంది మాట్లాడుతున్నారు.. ఈ టైంలోనే మనకి మన నాయకులు కావాలి.. రాజకీయాల్లో అప్పుడప్పుడు లిల్లీ పుట్టుగాళ్లకు కూడా అధికారం వస్తుంది అని ఆయన చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్టు లేదు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ భయంతో నారాయణాపేట సభలో భయంతో మాట్లాడుతున్నారు.. ఎప్పుడు ఆయన బీజేపీతో కలుస్తాడో తెలియదు అని పేర్కొన్నారు. వాళ్ళకి ఇంకా మంచి పనులు చేయమని అధికారం జనాలు ఇస్తారు.. ప్రపంచంలో ఎక్కడ లేని అంబెడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టాను.. లిల్లిపుట్టుగాళ్ల ప్రభుత్వంలో అంబెడ్కర్ కి అవమానం జరిగింది.. అంబేడ్కర్ విగ్రహాన్ని చూడటానికి ఎందరో వస్తే కనీసం మంచినీళ్లు కూడా పెట్టలేదు అని కేసీఆర్ అన్నారు.
Read Also: Balakrishna: చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మనమే..
బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ మెడలు వచ్చి పని చేయిస్తుంది అని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్న, 24 గంటల కరెంట్ కావాలన్న మళ్ళీ BRS రావాలి.. ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 2 సీట్లు కూడా రావు అది సర్వేలో తేలింది..కూసుంటే లేవచేతకాదు కానీ చెట్టంత ఎగురుతా అన్నాడట.. డిసెంబర్ 9వ తేదీ నాడు రుణమాఫీ చెయ్యలేదు కానీ ఆగస్టు 15 వరకు చేస్తాం అంటున్నారు.. ఓట్లు ఆగమాగం వేయొద్దు.. మొన్న ఎలక్షన్స్ లో దెబ్బతిన్నాం.. రైతులకు ఇస్తామన్న బోనస్ కచ్చితంగా ఇవ్వాలి.. దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం.. మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయి ట్యాంకర్లు వస్తున్నాయి.. ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు అని కేసీఆర్ అన్నారు.
Read Also: Harish Rao: కాంగ్రెస్పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది..
అంబేడ్కర్ విగ్రహం దగ్గరికి పోనీ నువ్వు ఆయన పేరున్న సెక్రటేరియట్ లో ఎందుకు కూర్చున్నావు సిగ్గులేదా అని కేసీఆర్ మండిపడ్డారు. అహంకారమా..? కండకావురామా?.. అంబేడ్కర్ ని అవమానించిన వారికి సురుకు పెట్టాలి.. ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే వాళ్ళకి ఈ ఎన్నికల్లో సురుకు పెట్టాల్సిందేనన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభుత్వానికి ముకుతాడు వెయ్యాలన్నారు. మెదక్, జహీరాబాద్ లో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించండి.. రైతు బంధు ఇంకా ఇవ్వలేదు.. పంటలు కోతకు వచ్చాయి అవి కొనే దిక్కు లేదు.. బోనస్ ఇస్తామన్నారు అది గతే లేదు.. సిద్దిపేటలో రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డ్ ఉద్యమం పెట్టారు.. రేపటి నుంచి తెలంగాణ అంతటా ఈ పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలి అని ఆయన పిలుపునిచ్చారు. నీ గుడ్లు పీకి గోటిలాడుకుంటాం, పేగులు మెడలేసుకుంటాం, చెడ్డి పీకుతాం అని మాట్లాడుతున్నారు.. నేను వస్తుంటే కొంతమంది పోలీసులు మా పోస్టర్లు పీకేస్తున్నారు జాగ్రత్త.. మేము పదేళ్లు ఉన్నాం.. మళ్ళీ మేము వస్తాం అన్ని రికార్డ్ చేస్తున్నాం.. ప్రజల స్పందన చూసి DGP మారాలి.. లేకపోతే ప్రజలే ఎదురుతిరుగుతారు అని కేసీఆర్ పేర్కొన్నారు.