NTV Telugu Site icon

KCR : కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య.. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు

Kcr

Kcr

కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య అని, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేటీఆర్‌. ఇవాళ ఆయన నల్గొండలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… గతంలో ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయని, మా బతుకు ఇది అని చెప్పినా గతంలో ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. బీఆర్‌ఎస్‌ వచ్చాక నల్గొండను ఫ్లోరైడ్‌ రహితంగా చేశామన్నారు. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్‌ బాధలు పోయాయి. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. పదేళ్లలో నేనేం తక్కువ చేయలేదని, ఎక్కడినుంచో కరెంట్‌ తెప్పించి విద్యుత్‌ కోతలు లేకుండా చేశామన్నారు కేసీఆర్‌. నా గడ్డ, నా ప్రజలు, నా ప్రాంతం అనుకుంటే ఏమైనా సాధించొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా కలిపి మంచిగా నీళ్లు తెచ్చుకున్నామని, బస్వాపూర్‌ పూర్తైందని, దిండి ప్రాజెక్ట్‌ పూర్తి కాబోతోందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తైతే పాలమూరు, వికారాబాద్‌, రంగారెడ్డి ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.

INDIA bloc: ఢిల్లీలో ఒకటి మీకు, గుజరాత్‌లో 8 మాకు.. ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ..
‘దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. వాళ్లు ఉన్నంత మాత్రాన మనం నర్వస్‌ కావొద్దు. ఎక్కడికక్కడ మనం నిలదీయాలి. ఏమైందిరా బిడ్డ నా కరెంటు అని అడగాలి. ఇవాళ నేను ఒక మాట కుల్లకుల్లగా చెబుతున్న. మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా.. ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో 4వేల మెగాపవర్‌ ప్లాంట్‌ కట్టినం జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో. 90శాతం పనులు పూర్తయ్యాయి. రెండుమూడు నెలలు తిప్పలుపడితే 4వేల మెగావాట్ల పవర్‌ వస్తుంది. రామగుండంలో ఆ నాడు మొదలుపెట్టిన ఎన్టీపీసీ 800 మెగావాట్ల పవర్‌ వచ్చింది. ఇంకో 800 మెగావాట్లు రాబోతున్నది. ఆ నాడు నడిపిన నాడు ఉన్నదాని కంటే 5600 మెగావాట్ల పవర్‌ కరెంటు ఎక్కువగ ఉండంగ కూడా.. వీళ్లకు ఏం రోగం పుట్టింది.. కరెంటు ఎందుకు ఇస్తలేరు ? ఎందుకు తిప్పలుపెడుతున్నరు ? బిడ్డా ఛలో నల్లగొండతోనే ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బజార్లలో నిలదీస్తాం’ అని కేసీఆర్‌ అన్నారు.

Pakistan: పాక్‌ ఎన్నికలపై వివాదం.. రిగ్గింగ్ జరిగిందని దాఖలు చేసిన 30 పిటిషన్లు తిరస్కరణ