KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్‌రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి మరణంతో తానొక ఆప్తమిత్రుడిని, నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయానంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పెద్ది కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, కార్యకర్తలూ ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో పెద్ది వహించిన పాత్రను కేసీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్మరించుకున్నారు. వరంగల్ జిల్లా ఉద్యమ ప్రస్థానంలో తనతో కలిసి నడిచిన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డిని బతికించుకోవడానికి పార్టీ తరఫున విశ్వప్రయత్నాలు చేశామని, వైద్యులు కూడా తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆయన దక్కకపోవడం తీరని మనోవేదనకు గురిచేసిందన్నారు. పోరాటాల ఖిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలోనే జీవించారని చెప్పారు. అటు స్వరాష్ట్ర పోరాటంలోనూ, ఇటు నర్సంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలోనూ పెద్ది తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారని కేసీఆర్ నివాళులర్పించారు.
Also Read
మరోవైపు.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఇక, ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు పెద్ది మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!