గ్యాడ్యుయేషన్ సమయంలోనే..
తెలంగాణలోని నల్లగొండ పట్టణానికి చెందిన యువ ఎంటర్‌ప్రెన్యూర్ డా.భరత్ కుమార్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొదటి నుంచి ఉద్యోగం కంటే వ్యాపారం పైనే దృష్టి ఉన్న ఆయన గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలోనే కేబీకే బిజినెస్ సొల్యూషన్స్ పేరుతో చిన్న ఐటీ కంపెనీ స్థాపించారు. డిగ్రీ పూర్తవగానే అమెరికా వెళ్లి ఎంఎస్ చేశారు.
కేబీకే గ్రూప్ గా అవతరించి..
అమెరికాలో ఎంఎస్ విద్యనభ్యసిస్తున్న సమయంలోనే ఇండియాలో కేబీకే బిజినెస్ సొల్యూషన్స్ ను మరింత విస్తరించారు. 15 ఏళ్లలో డిజిటల్ మార్కెటింగ్, ఐటీ, రియల్ ఎస్టేట్, డిజిటల్ మీడియా తదితర రంగాల్లో కంపెనీలు స్థాపించి కేబీకే గ్రూప్ గా తీర్చిదిద్దారు. తద్వారా నేడు కొన్ని వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సక్సెస్ ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా నిలిచారు.
అమెరికాలో భారతీయ విద్యార్థులకు సాయం..
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు వారికి భరత్ కుమార్ తన వంతుగా సాయం చేస్తున్నారు. ఆయన స్థాపించిన ఐటీ కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారికి మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారు. టెక్సాస్‌లోని ఆస్టిన్, డల్లాస్ నగరాల్లో ఈక్వినాక్స్ ఐటీ సొల్యూషన్స్, బోన్సాయ్ సొల్యూషన్స్ ద్వారా ద్వారా వందలాది మంది భారతీయ విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు రావడంలో తన వంతు సాయం అందిస్తున్నారు భరత్ కుమార్.
డిజిటల్ మార్కెటింగ్ సేవలతో..
ప్రస్తుత ఉన్నది డిజిటల్ యుగం. ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఏ వ్యాపారం అయినా త్వరితగతిన వృద్ధి చెందాలంటే మార్కెటింగ్ సేవలు అవసరం. ఒక కంపెనీ ద్వారా అందించే సేవలైనా, ఉత్పత్తులైనా వినియోగదారులకు చేరాలంటే డిజిటల్ మార్కెటింగ్ తో నే సాధ్యం. కేబీకే బిజినెస్ సొల్యూషన్స్ ద్వారా ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందిస్తున్నారు భరత్ కుమార్. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త మెళకువలతో పలు కంపెనీలకు వెబ్ సైట్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు అందిస్తున్నారు. కేబీకే బ్రాడ్ కాస్టింగ్స్ ద్వారా డిజిటల్ యాడ్స్, ప్రమోషన్ వీడియోలు రూపొందిస్తున్నారు. కేబీకే ప్రొడక్షన్స్ ద్వారా షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ సినిమాల పట్ల ఆసక్తి ఉన్న ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహిస్తున్నారు. కేబీకే రియల్టర్స్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించారు.
కేబీకే హాస్పిటల్స్ తో ఆరోగ్య రంగంలోకి..
ప్రస్తుతం యాంత్రిక జీవితంలో పని ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోజు రోజుకి మరింత విస్తరిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎదుర్కొంటున్న డయాబెటిస్ ఫుట్ అల్సర్స్ కు కేబీకే హాస్పిటల్ ద్వారా అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. గ్యాంగ్రీన్, సెల్యూలైటిస్ తదితర వ్యాధులకు ఆంప్యుటేషన్ రహిత వైద్య విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇలా తను అడుగుపెట్టిన ప్రతి రంగంలో అభివృద్ది సాధిస్తూ, తన ప్రయాణంలో పరిచయమైన వారికి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త ఉపాధి మార్గాలను అన్వేషిస్తూ, ఉద్యోగాలను సృష్టిస్తూ యువ పారిశ్రామికవేత్తలకు ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు.
నిరుపేదల చదువుకు ఆర్థిక భరోసా..
కేబీకే గ్రూప్ వివిధ రంగాల్లో సర్వీసులు అందిస్తున్న భరత్ కుమార్ సామాజిక సేవలోనూ ముందున్నారు. దైవం మానుష రూపేణా అనే నానుడిని నిజం చేస్తూ అనాథల, అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు. కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రతి నెలా పలు అనాథ ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఏటా చదువులో రాణించే నిరుపేద అమ్మాయిల ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారు.
అరుదైన గౌరవాలు..
విభిన్న రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా భరత్ కుమార్ పలు అరుదైన అవార్డులు, గౌరవాలు అందుకున్నారు. వందే భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేత సంజీవ రత్న పురస్కార్, రాష్ట్రీయ గౌరవ్ పురస్కార్ అవార్డులు వరించాయి. వ్యాపారాల్లో విజయవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ బిజినెస్ కౌన్సిల్ 2024 జాబితాలో నిలిచారు.
అమెరికాలో భారీ ఆధ్యాత్మిక కేంద్రం.. హరిహర క్షేత్రం
వ్యాపారం నిమిత్తం అమెరికాలో స్థిరపడిన భరత్ కుమార్ తన మూలాలను మాత్రం మరవలేదు. తన ఆధ్యాత్మిక చింతనను కొనసాగిస్తూ సనాతన భారతీయ సంప్రదాయాలను పరిరక్షించే గొప్ప సంకల్పంతో అమెరికాలో ఓ భారీ ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పుతున్నారు. టెక్సాస్ లోని ఆస్టిన్ నగరంలో హరిహర క్షేత్రం పేరుతో ఓ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. జార్జ్ టౌన్ ప్రాంతంలోని 375 కింగ్ రియాలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శివాలయాలతోపాటు గణపతి, అయ్యప్ప స్వామి, దుర్గ, సరస్వతి ఆలయాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆలయంలో నిత్య పూజలు, పండుగ సందర్భాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు.