టాలీవుడ్ యంగ్ హీరోలలో మాస్ క దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాలంటైన్స్ డే కానుకగా ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్ సేన్. కానీ ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు మొదటి ఆటకే లైలా వాషౌట్ అయింది. ఆ విషయాన్ని అంగీకరిస్తూ ప్రేక్షకులను సారి కూడా చెప్పాడు విశ్వక్ సేన్. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్.
Also Read : Anasuya : తెల్లతెల్లని చీరలోన రంగమ్మత్త.. పట్టపగలు వచ్చినావే రంగమ్మత్త
ఈ నేపథ్యంలో జాతిరత్నాలు ఫేమ్ కెవి.అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఫంకీ’ అనే టైటిల్‌ను కూడా లాక్ చేసారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ ను ఎవరనే దానిపై కృతి శెట్టితో పాటు పలువురు పేర్లు వినిపించాయి. యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విశ్వక్ సేన్ సరసన కథానాయకిగా కయాదు లోహర్ ను ఫిక్స్ చేశారట. తాజాగా విడుదలైన తమిళ్ డబ్బింగ్ సినిమా రిటర్న్ ది డ్రాగన్ లో నటించి మెప్పించింది లోహర్. తెలుగులో శ్రీవిష్ణు నటించిన అల్లూరి సినిమా తర్వాత తెలుగులో నటిస్తున్న రెండవ సినిమా ఫంకీ. కేవీ అనుదీప్ డైరెక్ట్ చేస్తున్న ఫంకీ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.