NTV Telugu Site icon

Kaviya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్.. కనీసం కావ్య పాప కోసమైనా గెలవండి..

Kavya Maran

Kavya Maran

ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. 6 బంతుల్లో 9 పరుగులు చేయలేక ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పేరు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మైదానంలో తన హావ భావాలతో అందర్నీ ఆకట్టుకుంది. వికెట్ కోల్పోయినప్పుడు బాధపడి.. బౌండరీలు బాదినప్పుడు ఎగిరి గంతేసింది కావ్య పాప. కానీ మ్యాచ్‌ చివర్లో ఆమె చేసిన సందడి సోషల్ మీడియాని షేక్ చేసింది.

Also Read : Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలే..

సన్‌రైజర్స్ విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన సమయంలో వైభవ్ అరోరా వేసిన 19వ ఓవర్‌లో మార్కో జాన్సెన్(1) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దీంతో సన్‌రైజర్స్ అభిమానులతో పాటు కావ్య మారన్ కూడా తీవ్ర నిరాశకు గురైంది. అయితే క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ ఓ బౌండరీ కొట్టడంతో.. వెంటనే నోబాల్‌ను అబ్దుల్ సమద్‌ మరో బౌండరీ కొట్టడంతో కావ్య మారన్ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. గ్రౌండ్ లో ఎగిరి గంతేసిన కావ్య పాప.. గట్టిగా అరిచింది. విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేసింది. కానీ చివరి ఓవర్‌లో వరుణ్ చక్రవర్తీ అబ్దుల్ సమద్‌ను ఔట్ చేయడంతో పాటు 3 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఓటమిపాలైంది. దాంతో కావ్య మారన్ ముఖం కూడా చిన్నబోయింది.

Also Read : Minister KTR: జమ్మూ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల వాసి మృతి.. కేటీఆర్ సంతాపం

హెన్రీచ్ క్లాసెన్ బాదిన 102 మీటర్ల సిక్స్‌కు కావ్య పాప నోరెళ్లబెట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి నేపథ్యంలో అభిమానులు కావ్య మారన్‌పై ఫన్నీ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ను షేర్ చేస్తూ.. మా కావ్య పాపకు వచ్చిన కష్టం పగోడికి కూడా రావద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు. కావ్య పాప ముఖంలో నవ్వు లేకుండా చేస్తున్నారు కదరా..? అంటూ ఆటగాళ్లపై మీమ్స్ తో మండిపడుతున్నారు. కావ్య పాప బాధపడటం తాము తట్టుకోలేకపోతున్నామని, దయచేసి ఆమె కోసమైన మీరు మ్యాచ్ గెలవాలని నెటిజన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం ట్విటర్‌లో కావ్య మారన్ పేరు ట్రెండింగ్ అవుతుంది.

Show comments