NTV Telugu Site icon

MLC Kavitha : న్యాయం గెలుస్తది నిజం నిలబడుతుంది..

Mlc Kavitha

Mlc Kavitha

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఈ సందర్భంగా కవితపై పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో సాయంత్రం జూబ్లీహిల్స్‌ని నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని ఆమె అన్నారు. న్యాయబద్ధమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని, నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి.. కచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుందన్నారు. నిజం నిలకడమీద తెలుస్తుందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని, నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా అని కవిత వ్యాఖ్యానించారు.

INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి రేపు ప్రారంభం..
చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుందని విన్నాం చూశాం.. అది భారతదేశములోనైనా తెలంగాణ లోనైనా.. నా విషయంలో కూడా న్యాయం గెలుస్తుంది.. ధర్మం గెలుస్తుంది.. అదే జరుగుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటానని ఆమె తెలిపారు. ఈ అపవాదులను తట్టుకొని కడిగిన ముత్యంలా వస్తాను నాకు విశ్వాసం ఉందని ఆమె అన్నారు. అయితే.. తన ఇంటికి చేరుకున్న అనంతరం సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు కవిత. తన కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్న కవిత.. తన తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు.. కుటుంబ సభ్యులను చూసి ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు కవిత.. కవితను చూసి కుటుంబ సభ్యులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. పూజ గదిలో దేవుని చిత్రపటాల ముందు సాష్టాంగ నమస్కారం చేశారు కవిత.

Ambati Rambabu: గతంలో జగన్ చేసిన కృషి వల్లే పోలవరానికి నిధులు..