Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
- కాటేదాన్ పారిశ్రామిక వాడలో పేలుడు..
- ఇద్దరు కార్మికులకు గాయాలు, ఇందులో ఒకరి పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నగర శివారులోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ప్లాస్టిక్ బాటిళ్ల తయారీ పరిశ్రమలో మంగళవారం భారీ రసాయన పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. Ms పరిశ్రమకు బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ఖాళీ బాటిళ్లను కార్మికులు పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర శబ్దంతో రసాయన పేలుడు చోటుచేసుకుంది.
పేలుడు ధాటికి అక్కడే విధుల్లో ఉన్న సాయి అనే కార్మికుడి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా అతని కాలిపాదం సగం మేర తెగిపడటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న మరో కార్మికుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు శబ్దం విన్న తోటి కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై ఘటనా స్థలానికి పరుగులు తీశారు.
Also Read
రక్తపు మడుగులో పడి ఉన్న బాధితులను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాటిళ్లలో మిగిలిపోయిన రసాయన అవశేషాల కారణంగానే ఈ పేలుడు జరిగిందా లేక ఇతర సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పరిశీలించాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?