Site icon NTV Telugu

YSRCP: బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలి.. వైసీపీ డిమాండ్‌

Mla Budda Rajasekhara Reddy

Mla Budda Rajasekhara Reddy

YSRCP: నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారింది.. ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. సొంత పార్టీ ఎమ్మెల్యేపై మంత్రి నారా లోకేష్‌తో పాటు సీఎం చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.. అయితే, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దౌర్జన్య ఘటనపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. బుడ్డా రాజశేఖర్‌ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలిలని డిమాండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు, అధికారం మారిన తర్వాత పరిస్థితి గురించి ఆలోచించాలి.. అధికారం పోయిన తర్వాత, చేసిన వాటిని అనుభవించాల్సి వస్తుంది.. పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలి, లేకపోతే ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు కాటసాని రాంభూపాల్ రెడ్డి..

Read Also: Big News : కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు ఛేదించిన పోలీసులు.. హంతకుడు ఎవరంటే..?

ఇక, బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీశాఖ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గచర్య అన్నారు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు నటిస్తుందని విమర్శించారు.. బుడ్డా పై పెట్టిన నాన్ బెయిలబుల్ కేసులు వేస్ట్ అన్నారు.. ఎమ్మెల్యే బుడ్డాను సీఎం చంద్రబాబు ఎందుకు పిలిపించి మందలించలేదు? అని నిలదీశారు.. బుడ్డా ఆంబోతులా వ్యవహరిస్తే సీఎం చంద్రబాబు కళ్లు మూసుకొని నిద్రపోతున్నారు అని ఫైర్‌ అయ్యారు.. అధికారంలోకి వచ్చాక పట్టుడు కర్రల ఫ్యాక్టరీ పెడతామన్న బుడ్డా మాటల వెనుక ఆంతర్యం ఇదేనా? అని ప్రశ్నించారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి లోకేష్ తక్షణమే స్పందించాలి.. బుడ్డాపై కేసులు పెట్టి, పార్టీ నుండి సస్పెండ్ చేసి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.. బుడ్డాను నిర్లక్ష్యంగా అచ్చోసిన ఆంబోతులా వదిలేస్తే ప్రజల హింసిస్తాడు.. బుడ్డా అక్రమ వసూళ్లు , దౌర్జన్యాలపై మంత్రి లోకేష్ విచారణ కమిటీని వేయాలి.. బుడ్డా వ్యాపారం , కాంట్రాక్టులు చేయడం లేదు కేవలం వసూళ్లపై రాజకీయాలు చేస్తున్నారు… పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి తన నిజ స్వరూపాన్ని చూపాలి… బడ్డాపై చర్యలు తీసుకొని అటవీశాఖ అధికారులు మనోధైర్యాన్ని నింపాలని కోరారు శిల్పా చక్రపాణి రెడ్డి..

Exit mobile version