NTV Telugu Site icon

Omar Abdullah: కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు.. ఎన్నికల కోసం అడుక్కోరు

Omar Abdullah

Omar Abdullah

Omar Abdullah: ఎన్నికలు ప్రజల హక్కు అని… జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కశ్మీరీలు కేంద్రం ముందు అడుక్కోరని.. వారు బిచ్చగాళ్లు కాదని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదని.. ఎన్నికలు మా హక్కు అని.. ఎవరి ముందు అడుక్కోము అని ఆయన తెలిపారు. కశ్మీరీలకు ఎన్నికలు జరగడం మంచిదే కానీ.. ఎన్నికల కోసం ఎవరినీ అడుక్కోరన్నారు.

ఆస్తులు, ప్రభుత్వ భూముల నుంచి ప్రజలను ఖాళీ చేయించడం గురించి అడిగిన ప్రశ్నకు.. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఇది ఒక కారణమని ఒమర్‌ అబ్దుల్లా ఆరోపించారు. అందుకే వారు ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన పేర్కొన్నారు. వారు ప్రజలను వేధించాలనుకుంటున్నారని.. తగిలిన గాయాలకు ఔషధతైలం పూయడానికి బదులుగా, వారు గాయాన్ని మరింత తీవ్రతరం చేయాలనే తపనతో ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వం ప్రజల గాయాలను మాన్పడానికి ప్రయత్నిస్తుందని బీజేపీ ప్రభుత్వానికి తెలుసునని, అయితే వారు కేవలం ఉప్పు, కారం రుద్దుతున్నారని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.

Tamil Nadu: గవర్నర్, ప్రభుత్వం మధ్య మరో వివాదం.. కాకరేపుతోన్న “పొంగల్” ఇన్విటేషన్

రాజౌరి దాడి తరువాత గ్రామ రక్షణ గార్డులకు ఆయుధాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం గురించి అడిగిన ప్రశ్నకు.. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో దేశానికి చేసిన హామీలు పూర్తిగా విఫలమైనట్లు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన అన్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్‌లోని తుపాకీ సంస్కృతి తగ్గుముఖం పడుతుందని చెప్పబడింది. రాజౌరిలో ప్రస్తుతం జరుగుతున్న దాడులు, కాశ్మీర్‌లో పరిస్థితి, భద్రతా బలగాల సిబ్బంది సంఖ్యను పెంచడం.. ఇవన్నీ పరిస్థితి అదుపులోకి రాలేదనే వాస్తవాన్ని సూచిస్తున్నాయని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. అందుకే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవలసి వచ్చిందన్నారు. రాజౌరి జిల్లా ధంగ్రీ గ్రామంలో జనవరి 1న జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు.

Show comments