NTV Telugu Site icon

Sardar 2: బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్.. ‘సర్దార్‌ 2’ ప్రోలాగ్‌ వీడియో అదుర్స్!

Sardar 2 Prologue Video

Sardar 2 Prologue Video

2022లో స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా ‘సర్దార్‌’. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంకు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించారు. కార్తీ కెరీర్‌లో సర్దార్‌ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సర్దార్‌ సీక్వెల్‌గా ‘సర్దార్‌ 2’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్‌ను పరిచయం చేస్తూ.. ప్రోలాగ్‌ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.

Also Read: Subham Teaser: శోభనం గదిలో ట్విస్ట్.. ఇంట్రెస్టింగ్‍గా సమంత ‘శుభం’ మూవీ టీజర్!

2 నిమిషాల 57 సెకండ్ల నిడివి గల సర్దార్‌ 2 ప్రోలాగ్‌ వీడియో.. యాక్షన్ సీన్‌తో ఓపెన్ అయింది. ‘ఇది నాతో సర్దార్‌.. ఓ పెద్ద ప్రమాదం నీ దేశంకు పొంచి ఉంది. బ్లాక్ డాగర్ ఈజ్ కమింగ్’ అంటూ ఎస్‌జే సూర్యను పరిచయం చేశారు. ఈ ప్రోలాగ్‌ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. సర్దార్‌ 2లో కార్తీ సరసన మాళవిక మోహనన్‌, ఆషిక రంగనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సర్దార్‌లో రాశీ ఖన్నా, రాజీషా విజయన్ నటించిన విషయం తెలిసిందే.