Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: వివాహం అనేది కేవలం జీతం, హోదా లేదా కుటుంబ నేపథ్యాన్ని చూసి మాత్రమే నిశ్చయమయ్యేది కాదు. నేటి సోషల్ మీడియా యుగంలో భాగస్వామి ఆలోచనలు, వ్యక్తిత్వం, ఆశయాలు, జీవన విలువలతో పాటు పొలిటికల్ మైండ్‌సెట్ (రాజకీయ దృక్పథం) కూడా వివాహ నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో చోటుచేసుకుందంటూ నెట్టింట వైరల్ అవుతున్న ఒక పెళ్లి ముచ్చట ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. రూ. 40 లక్షల వార్షిక ప్యాకేజీ ఉన్న ఒక సంబంధాన్ని, ఇన్స్టాగ్రామ్ రాహుల్ గాంధీని ‘రోల్ మోడల్’గా పెట్టుకున్నాడనే ఒకే ఒక్క కారణంతో ఓ యువతి తిరస్కరించిందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
వైరల్ పోస్టుల ప్రకారం.. పెళ్లి చర్చలు జరుగుతున్న సమయంలో సదరు యువతి ఆ యువకుడి ఇన్స్టాగ్రామ్ బయోలో రాహుల్ గాంధీ పేరును చూసింది. వెంటనే ఆ సంబంధాన్ని ఇక తెంచుకోవాలని నిర్ణయించుకుంది. “ఒక ఓడిపోయిన వ్యక్తి (loser) నీకు రోల్ మోడల్ అయితే, నీతో నా భవిష్యత్తు ఎలా ఉంటుంది?” అని ఆమె వ్యాఖ్యానించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వైరల్ క్లెయిమ్‌లో పేర్కొన్న జీతం, ఇన్‌స్టా్గ్రామ్ బయో లేదా పెళ్లి చర్చలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ గానీ, సంబంధిత వ్యక్తుల ప్రకటనలు గానీ వెలువడలేదు. ఈ కథనం సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం.. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ‘రాజకీయ భావజాలం’ అనేది ఎంతవరకు ముఖ్యం? అనే ప్రశ్నను ఇది రేకెత్తించడమే. కొందరి దృష్టిలో రాజకీయ అభిప్రాయాలు వేరైనా కలిసి జీవించవచ్చు. కానీ మరికొందరికి రాజకీయ దృక్పథం అనేది ఆ వ్యక్తి అంతర్గత విలువలను, ఆలోచనా సరళిని ప్రతిబింబించే కొలమానం. ఒకవేళ ఈ కర్ణాటక ఘటన నిజమే అయితే, రాజకీయాలు కేవలం ఓటింగ్, లీడర్ల వరకే పరిమితం కాకుండా వ్యక్తిగత జీవితాలను, వివాహ నిర్ణయాలను కూడా ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
ఈ వైరల్ వార్తపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ యువతి తన భావాలకు కట్టుబడి సరైన నిర్ణయమే తీసుకుందని కొందరు ప్రశంసించారు. “ఆమె నిజమైన కన్నడ పిల్ల.. కన్నడిగులకు తెలివితేటలు ఎక్కువ” అని ఒకరు కామెంట్ చేయగా, “ఆమె మంచి తెలివైన అమ్మాయి, ఆమెను చూస్తే గర్వంగా ఉంది” అని మరొకరు రాసుకొచ్చారు. “ఇంతటి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నందుకు హాట్సాఫ్” అని ఇంకొందరు మద్దతు తెలిపారు. అయితే మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కేవలం రాజకీయ ఇష్టాయిష్టాల ఆధారంగా ఒక వ్యక్తి బంధాన్ని, భావి జీవితాన్ని తూచకూడదని వాదించారు. ఈ కథనం ఇంకా అధికారికంగా నిర్ధారణ కానందున, దీనిని ఒక వైరల్ ట్రెండ్‌గా మాత్రమే చూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నోట్: ఈ వార్తను ఎన్టీవీ ntvtelugu.com క్లైమ్ చేయలేదు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం అధారంగా మాత్రమే ఆ వివరాలను పంచుకున్నాం.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి