Prajwal Revanna case: బాధితుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన సిట్.. నెంబర్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ తీవ్ర సంచలనంగా మారింది. పదుల సంఖ్యలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ పరిణామం తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ ఇండియా నుంచి జర్మనీ వెళ్లాడు. ఇదిలా ఉంటే ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతని తండ్రి హెచ్డీ రేవణ్ణలపై కూడా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ ఉదంతంపై ఇప్పటికే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. మరోవైపు మహిళ కిడ్నాప్ కేసులో శనివారం హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Devendra Fadnavis: కసబ్ గురించి కాంగ్రెస్ ఆందోళన.. 26/11 దాడులపై రాజకీయం..
Also Read
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
- Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్‌స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
ఇప్పటికే రెండు సార్లు నిందితులకు లుకౌట్ నోటీసులు జారీ చేయగా.. తాజాగా ‘బ్లూ కార్నర్ నోటీస్’ కూడా జారీ చేసినట్లు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాధితుల కోసం ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఎవరైనా ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు ఉంటే హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపింది. ఇందుకోసం హెల్ప్‌లైన్ నెంబర్ 6360-938947 గా సిట్ పేర్కొంది. ఈ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు
ఇదిలా ఉంటే డిప్లామాట్ పాస్‌పోర్టుపై ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లాడు. ఇతడిని రప్పించేందుకు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా ‘బ్లూ కార్నర్ నోటీస్’ జారీ చేసినట్లు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర అన్నారు. అతను ఎక్కడ ఉన్నాడో సిట్ కనుక్కుంటుందని, ఆ తర్వాత అతను ఇక్కడికి తీసుకురాబడుతారని చెప్పారు. ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు.
బ్లూ కార్నర్ నోటీసులు అంటే ఏమిటి..?
బ్లూ-కార్నర్ నోటీసు అనేది వాంటెడ్ వ్యక్తులు లేదా నేరస్థుల గురించి సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడానికి ఉపయోగించే హెచ్చరిక. ఈ వ్యవస్థ ద్వారా దేశాల మధ్య నేరస్థుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఇంటర్‌పోల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, బ్లూ కార్నర్ నోటీసులు క్రిమినల్ విచారణలో ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాయి. ఒక వ్యక్తి యొక్క నేర చరిత్ర వివరాలు పొందడంతో పాటు తప్పిపోయిన వ్యక్తిని గుర్తించడానికి ఈ నోటీసులు ఉపయోగపడుతాయి.
సీబీఐ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్ వంటి వివిధ రకాల నోటీసులు ఉంటాయి. ఇందులో రెడ్ కార్నర్ నోటీసులు నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరుతాయి. నేరారోపణ దాఖలు చేయడానికి ముందు లేదా తర్వాత బ్లూ కార్నర్ నోటీసులు వస్తాయి. ప్రస్తుతం ప్రజ్వల్ జర్మనీలో ఉండటంతో ఆయనను రప్పించే పనిలో అధికారులు ఉన్నారు.

తాజావార్తలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
-
Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!