Father Cruelty: కొడుకును చంపేందుకు సుపారీ ఇచ్చి.. హత్య చేయించిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Cruelty: కర్ణాటకలోని హుబ్లీ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. తన కొడుకును చంపేందుకు ఓ తండ్రి కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆరుగురికి సుపారీ ఇచ్చి మరీ కొడుకును దారుణంగా హత్య చేయించాడు. వివరాల్లోకి వెళితే.. 26 ఏళ్ల అఖిల్ అనే నగల వ్యాపారి డిసెండర్ 1న హత్యకు గురయ్యాడు. అఖిల్ కనిపించడం లేదంటూ అతడి మేనమామ డిసెంబర్ 3న మిస్సింగ్ హుబ్లీ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ కేసును కప్పిపుచ్చేందుకు అయితే తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ అఖిల్ తండ్రి భరత్ మహాజన్‌శెట్టి ప్రయత్నించాడు. కొన్ని రోజుల తర్వాత తన కుమారుడు ఫోన్ చేశాడని, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడంటూ పోలీసులకు తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తండ్రి తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కుటుంబ సభ్యులందరినీ ప్రశ్నించారు. కొన్ని ఆధారాలు లభించిన తర్వాత తండ్రి భరత్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో తండ్రిని విచారించారు. అప్పుడే తండ్రి నిజాన్ని ఒప్పుకున్నాడు. కొడుకును చంపేందుకు ఆరుగుని నియమించుకున్నట్లు నిజం తెలిపాడు.
Read Also: Uttarakhand Accident : ఉత్తరాఖండ్ లో ఘోరం.. కాల్వలో పడ్డ కారు.. నలుగురి మృతి
Also Read
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
కాగా, వ్యక్తిగత కారణాల వల్లే కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు సుపారీ ఇచ్చి కుమారుడ్ని హత్య చేయించినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. ఈ నెల 1న కుమారుడు అఖిల్‌ను తానే స్వయంగా ఆరుగురికి చంపమని సుపారీ ఇచ్చి ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్లినట్లు తెలిపాడు. కిల్లర్లు అతడ్ని హత్య చేసి దేవికొప్పలోని చెరకు పొలాల వద్ద మృతదేహాన్ని పాతిపెట్టినట్లు చెప్పాడు. పోలీసులు బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీయించారు. కిమ్స్ ఫోరెన్సిక్ వైద్య నిఫుణులతో పోస్ట్‌మార్టం చేయించారు. మృతుడి తండ్రి భరత్‌తోపాటు ఆరుగురు కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల్ హత్య కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో మరి కొంతమంది పాత్ర కూడా ఉండవచ్చని పోలీస్ అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!