కర్ణాటకలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పదస్థతిలో మృతిచెందారు. అయితే హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Karnataka: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. హత్యగా అనుమానం!
కొప్పల్ తాలూకాలోని హోసలింగాపూర్‌లో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు రాజేశ్వరి (50), ఆమె కుమార్తె వసంత (28), వసంత కుమారుడు సాయిధర్మతేజ్ (5)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. అయితే ముగ్గురు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
వసంతకు రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల గ్రామంలోని ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె తన తల్లి , కొడుకుతో కలిసి హోసలింగాపూర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె హోసలింగాపూర్ సమీపంలోని బొమ్మల తయారీ కర్మాగారంలో ఉద్యోగం చేస్తోంది. వేరే మతానికి చెందిన సహోద్యోగిని వివాహం చేసుకుంది.
ఇది కూడా చదవండి: T20 World Cup 2024 Semifinals: సెమీఫైనల్ చేరుకొనే ఆ 4 టీమ్స్ ఇవే..
మే 28వ తేదీన రాజేశ్వరి మరో కుమార్తె.. తల్లికి ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో ఆమె వీరింటికి రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వసంత బెడ్‌రూమ్‌లో… రాజేశ్వరి, సాయిధర్మతేజ్‌ల మృతదేహాలను వంటగదిలో గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య కోణంలో దర్యాప్తు జరుగుతోంది.