Insurance Murder: ఛీ..ఛీ.. ఇలా కూడా డబ్బు సంపాదిస్తారా? రూ. 5కోట్ల జీవితబీమా క్లైమ్ కోసం ఏకంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Insurance Murder: డబ్బు.. మనుషులను ఎంతటి రాక్షసత్వానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. కర్ణాటకలో హోస్పేట్‌లో అలాంటి ఘటనే జరిగింది. కొంత మంది అడ్డంగా డబ్బు సంపాదించేందుకు రాక్షసుల్లా స్కెచ్ వేశారు. వారు చేసిన పని చూస్తే.. ఛీ..ఛీ.. ఇలా కూడా డబ్బు సంపాదిస్తారా అనేలా ఉంది. ఇంతకీ ఆ కంత్రీలు ఎవరు? ఏం చేశారు? అసలు కర్ణాటకలోని హోస్పేట్‌లో ఏం జరిగింది? అప్పనంగా డబ్బులు వస్తాయని స్కెచ్ వేశారు. కానీ డామిట్.. కథ అడ్డం తిరగడంతో అడ్డంగా బుక్కయ్యారు. చివరికి డబ్బులు కాదు కదా.. ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే.. సెప్టెంబర్ 28న కర్ణాటకలోని హోస్పేట్‌లో బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని ఆరా తీసిన పోలీసులు.. హోస్పేట్‌కు చెందిన గంగాధర్‌గా గుర్తించారు. అతని వివరాలు తీసుకుని.. భార్యకు సమాచారం ఇచ్చారు. ఆయన డెడ్ బాడీని పోస్టు మార్టం పూర్తి చేసి అప్పగించారు.
Illegal Liquor: నకిలీ మద్యం కేసులో కీలకంగా మారిన లిక్కర్ డైరీ.. లిస్టులో ప్రముఖుల పేర్లు!
Also Read
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
ఇంతవరకు ఓకే.. కానీ రోడ్డు ప్రమాదం అయినప్పటికీ ఆమె ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత పోలీసులు చెప్పిన మాటలు ఆమెను షాక్‌కు గురి చేశాయి. బైక్‌పై వెళ్తున్న గంగాధర్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారని చెప్పారు. అక్కడే ఆమెకు డౌట్ వచ్చింది. తన భర్తకు పక్షవాతం ఉందని.. బైక్ నడిపడమేంటని పోలీసులను ఎదురు ప్రశ్నించింది. దీంతో షాకైన పోలీసులు.. అసలు ఏం జరిగిందనేది ఆరా తీయడంతో పక్కా మర్డర్‌గా తేలింది.
పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. గంగాధర్‌పై రూ. 5కోట్ల విలువైన జీవితబీమాతోపాటు రూ. 25 లక్షల ప్రమాద బీమా ఉన్నట్లు గుర్తించారు. డబ్బు కోసం ఆశపడిన గంగావతి మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ క్రిష్ణప్ప, బ్యాంకు ఉద్యోగి యోగరాజ్ సింగ్ తోపాటు మరో నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధరపై బీమా చేయించినట్లు చెబుతున్నారు. పక్షవాతంతో ఉన్న గంగాధర త్వరలో చనిపోతాడని భావించి డాక్టర్, బ్యాంకు ఉద్యోగి సహాయంతో నిందితులు భారీ మొత్తంతో బీమా చేయించారు. అతడు చనిపోతే వచ్చిన డబ్బు పంచుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం గంగాధరకు నామినీగా ఓ మహిళ పేరును భార్యగా చూపి ఇన్సూరెన్స్ చేయించారు. ప్రీమియం డబ్బులు సైతం నిందితులే చెల్లించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అయితే బీమా చేసిన తర్వాత.. నిందితులు ఆశించినట్లు గంగాధర మరణించ లేదు. దీంతో అతడిని చంపేస్తే డబ్బు వస్తుందని డిసైడయ్యారు. అది కూడా యాక్సిడెంట్‌లా ఉండేందుకు స్కెచ్చేశారు. పథకం ప్రకారం సెప్టెంబర్ 28న గంగాధరను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించేందుకు హోస్పేట్ శివారులో సండూరు మార్గం వద్ద మృతదేహాన్ని పడేసి కారుతో తొక్కించారు. అయితే మృతుడి భార్య చెప్పిన వివరాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో ముఠా గుట్టు రట్టైంది. ఈ వ్యవహారంలో పోలీసులు మరికొందరిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా గతంలో ఇలాంటి ఘోరాలకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు చనిపోతే.. బీమా డబ్బులు వస్తాయి… నిజమే.. కానీ అతన్ని చంపేస్తే.. నేరస్తులవుతారు. నిందితులు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు అని పోలీసులు అంటున్నారు.
తాజావార్తలు
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..