Site icon NTV Telugu

Karnataka: సిద్ధరామయ్య ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు..

Siddaramaiah Government

Siddaramaiah Government

Karnataka: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి పొందాలని ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఈరోజు కోర్టు విచారిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై స్టే విధించింది.

READ ALSO: Ramyakrishna : ఆమె కోసం ఏడ్చిన రమ్యకృష్ణ

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..
తాజా హైకోర్టు నిర్ణయం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ ఉత్తర్వును జారీ చేసిందని హైకోర్టు అభివర్ణించింది. ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేస్తూ పునస్చైతన్య సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో.. ఈ చర్య ప్రైవేట్ సంస్థల చట్టబద్ధమైన కార్యకలాపాలను నిర్వహించే హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషన్ తరుఫు న్యాయవాదులు వాదించారు. జస్టిస్ నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ప్రభుత్వ ఆదేశంపై మధ్యంతర స్టే విధించి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది.

ప్రభుత్వ ఆర్డర్‌పై మంత్రి ఏమన్నారంటే..
కర్ణాటక మంత్రి హెచ్.కె. పాటిల్ ప్రభుత్వం ఏ ప్రత్యేక సంస్థకు వ్యతిరేకంగా ఈ చర్య తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఈ నిర్ణయాన్ని ఏ సంస్థకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా తీసుకురాలేదు. ప్రభుత్వ లేదా సంస్థాగత ఆస్తులను సరైన అనుమతితో, సరైన ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించడనికి తీసుకొచ్చాం. ఏదైనా ఉల్లంఘనపై ప్రస్తుత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని ఆయన చెప్పారు.

READ ALSO: Taliban – Islamabad: ఇస్లామాబాద్‌ను నాశనం చేస్తాం: తాలిబాన్లు

Exit mobile version