NTV Telugu Site icon

Karnataka: మాజీ సీఎంకు ఆస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Jd

Jd

Karnataka Former CM HD Kumaraswamy Admitted in Hospital: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ ముఖ్య నేత  హెచ్‌డీ. కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు.  తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనను బుధవారం బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.  హెచ్‌డీ కుమారస్వామి బుధవారం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లాలోని శ్రీనివాసపురలోని రైతుల భూములను సందర్శించాల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిండంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కుమార స్వామి ఆసుపత్రి పాలవడంతో ఇవాళ కోలార్ లో రైతులతో జరగాల్సిన సమావేశం రద్దయ్యింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే జేడీఎస్ పార్టీ కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహించారు కుమార స్వామి. దీంతో ఆయన అలసిపోయినట్లు తెలుస్తోంది. ఇక గతంలో కూడా2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు కూడా అలసట, జ్వరం కారణంగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారు. చాలా మంది ఆసుపత్రికి చేరకొని ఆయనను పరామర్శిస్తున్నారు.  ఇక అనారోగ్యం

Also Read: Rice Export: ఆ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఇక కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. బీజేపీ, జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అనేకమంది తమ పార్టీలో చేరబోతున్నారంటూ పదేపదే చెబుతున్నారు. దీంతో ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు తమ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా కాపాడుకోవాలనే టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈ రెండు పార్టీలు కర్ణాటకలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.