Physical Harassment : సమాజంలో ఎక్కడ అన్యాయాలు లేదా అక్రమాలు జరిగితే, పాపం ఎవరైనా ఆందోళన చెందితే, వారంతా పోలీసులను ఆశ్రయిస్తుంటారు. పోలీసు ఉద్యోగం అనేది చాలా మందికి ఒక గొప్ప అవకశంగా కనిపిస్తుంటుంది. సమాజంలో చాలామంది ఖాకీ యూనిఫాంలో సేవలు అందించాలని, పోలీసు అవ్వాలని ఆసక్తితో ఎదురు చూస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఈ స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు. పోలీసు ఉద్యోగం సాధించడం ఒక పెద్ద పోటీగా మారింది.
అయితే, ఆ గొప్ప ఉద్యోగాన్ని సాధించిన వారు తమ సేవలను సమాజానికి అర్పించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది తమ కోరికలను తీర్చుకోవడం కోసం, ఈ పవిత్రమైన ఉద్యోగం దుర్వినియోగం చేస్తూ సమాజంలో అవమానాలకు దారితీస్తున్నారు. వారు తమకు అన్యాయం జరిగిందని, పీఎస్ కు వచ్చిన బాధితులపై కన్నేసి, ఫోన్ లు చేసి వేధిస్తూ, తమ కోరికను తీర్చాలంటూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల, కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన మాత్రం పోలీసు శాఖను షాక్ కు గురి చేసింది. మధుగిరి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీవైఎస్పీ) రామ చంద్రప్ప, ఒక మహిళతో పోలీసు స్టేషన్‌లో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఒక భూమి వివాదం నేపథ్యంలో స్టేషన్‌కు వచ్చిన బాధితురాలిని లొంగదీసుకుని, ఆమె రూంకు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు తీవ్రంగా డీవైఎస్పీపై మండిపడుతున్నారు.
పోలీసు శాఖ కూడా ఈ ఘటనపై తీవ్ర చర్చలు జరుపుతోంది. కర్ణాటక హోమంత్రి జి. పరమేశ్వరన్ సొంత జిల్లాలో ఈ ఘటన జరగడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ దీనిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. డీవైఎస్పీ మాత్రం పరారీలో ఉన్నట్లు తెలియడంతో, ఈ ఘటనపై మరింత విచారణ జరగనుంది.