Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపిక నిర్ణయం అధిష్ఠానానికి అప్పగిస్తూ సీఎల్పీ తీర్మానం చేయడంతో పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక డీకే శివకుమార్ ఢిల్లీ టూర్‌ను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా యూటర్న్ తీసుకున్నారు. కడుపు నొప్పి వల్ల ఢిల్లీకి రావడం లేదన్నారు. అలాగే సీఎం పదవి చేపట్టనున్న సిద్ధరామయ్యను డీకే శివకుమార్ అభినందించారు. ఆయనకు (సిద్ధరామయ్యకు) అభినందనలు, గుడ్ లక్’ అని చెప్పారు.
Also Read : GT vs SRH: ముగిసిన గుజరాత్ బ్యాటింగ్.. సన్‌రైజర్స్ లక్ష్యం ఎంతంటే?
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ఈ పరిస్థితులు ఇలా ఉంటే కర్ణాటక సీఎం పీఠం విషయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పార్టీ హైకమాండ్‌కు మరోసారి గట్టి సంకేతాలు పంపించారు. ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో నాకంటూ ఓ వర్గం లేదు.. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే.. ఒంటరిగానే కాంగ్రెస్‌కు 135 సీట్లు తెచ్చిపెట్టా.. పైగా కాంగ్రెస్ చీఫ్(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు అని డీకే అన్నాడు.
Also Read : Mamata Banerjee : లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే…
అలాగే.. ఇతరుల బలంపై నేను మాట్లాడను.. అవసరమైతే నిరసన తెలుపుతా అంటూ డీకే శివ కుమార్ పేర్కొన్నారు. గతంలో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిచినా ధైర్యం కోల్పోకుండా పార్టీని తిరిగి బలోపేతం చేశానన్నారు. అయితే సీఎం పదవి విషయంలో పార్టీ హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను అని డీకే అన్నారు. తిరుగుబాటు చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నేనేం తిరుగుబాటు చేయను.. అలాగే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడను.. తానేం బచ్చాగాడ్ని కాదు.. నాకంటూ ఓ విజన్ ఉంది అని డీకే శివ కుమార్ అన్నారు.
Also Read : Python As Weapon: పెంపుడు పైథాన్‌ను ఆయుధంగా వాడి.. వ్యక్తిపై దాడి
ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది. అయితే సిద్ధరామయ్యను సీఎంగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు టాక్. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎం చేయడంతో పాటు ఆయనకు పలు కీలక శాఖలు ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే డీకే శివ కుమార్ రేపు ( మంగళవారం ) ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!