NTV Telugu Site icon

Karnataka assembly elections Live Updates: కొనసాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

Karnataka

Karnataka

Karnataka assembly elections Live Updates: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాల్సి ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ , కాంగ్రెస్‌, జేడీఎస్‌ పోటీ పడుతున్నాయి. 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. ఎన్నికల బరిలో 918 మంది స్వతంత్రులతో కలిపి 2,613 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డులోని పోలింగ్ కేంద్రాలలో ఫేస్ రికాగ్నైజేషన్ అమలు చేస్తున్నారు.

Read Also: Karnataka Election: కర్నాటకలో ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్‌లు..!

పోలింగ్‌ బందోబస్తు కోసం మొత్తం 84 వేల119 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక వ్యాప్తంగా 58,545 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 30 లక్షల 85 వేల 566 మంది ఓటర్లు ఉండగా.. 2,66,82,156 మంది పురుషులు, 2, 63, 98, 483 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తిరిగి రెండోసారి అధికారంలోకి రాలేదు. కర్ణాటకలోని మొత్తం ఓటర్లలో 17 శాతం లింగాయత్ లు, 15 శాతం మంది వొక్కలిగాలు, 35 శాతం ఓబీసీలు, 18 శాతం ఎస్సి/ఎస్టీలు, 12.92 శాతం ముస్లింలు, 3 శాతం బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ లింగాయత్, వొక్కలిగాలు, ఓబీసీలు కీలకం కానున్నారు.

The liveblog has ended.
  • 10 May 2023 06:48 PM (IST)

    సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం ఓటింగ్..

    కర్ణాటక ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 6 గంటల్లోపు క్యూలో నిలబడి ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించనున్నారు.

  • 10 May 2023 05:59 PM (IST)

    150 స్థానాల్లో పక్కాగా గెలుస్తాం: మల్లికార్జున ఖర్గే..

    కర్ణాటకలో కాంగ్రెస్ 150 స్థానాల్లో గెలుస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు మీ రోజు, ఈ రోజు కర్ణాటక రాష్ట్రం గెలుస్తుందని తెలుసుకోండి అంటూ ట్విట్టర్‌లో కామెంట్స్ చేశారు. కలబురగిలోని బసవ నగర్‌లో మల్లికార్జున ఖర్గే అతని కుటుంబ సభ్యలు ఓటేసిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. బీజేపీతో కర్ణాటక ప్రజలు విసిగిపోయారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుటుంటున్నారని ఖర్గే అన్నారు. తొలి మంత్రి వర్గ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలను నెరవేరుస్తామని చెప్పారు.

  • 10 May 2023 04:31 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్ హీరో ధృవ్ సర్జా..

    కర్ణాటక ఎన్నికల్లో కన్నడ స్టార్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరో ధృవ్ సర్జా బెంగళూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 10 May 2023 04:04 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03 శాతం ఓటింగ్..

    కర్ణాటక ఎన్నికలలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.03% ఓటింగ్ నమోదైంది.

     

  • 10 May 2023 03:40 PM (IST)

    కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

    మాండ్యా జిల్లాలోని నారాయణపురా గ్రామంలో జేడీఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ. మండ్యా ప్రాంతం జేడీయూకు పట్టున్న ప్రాంతం..

     

  • 10 May 2023 02:57 PM (IST)

    బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్

    కర్ణాటకలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

  • 10 May 2023 02:27 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు కిచ్చా సుదీప్

    కర్ణాటన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బెంగళూరులో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తాను సెలబ్రిటీగా ఇక్కడికి రాలేదని.. తాను భారతీయుడిగా వచ్చినట్లు.. ఓటేసిన అనంతరం అని కన్నడ నటుడు కిచ్చా సుదీప్ అన్నారు.

     

  • 10 May 2023 02:09 PM (IST)

    ఓటేసిన మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ దంపతులు

    జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, సతీమణి చెన్నమ్మతో కలిసి హసన్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

     

  • 10 May 2023 01:42 PM (IST)

    మధ్యాహ్నం 1గంటల వరకు 38 శాతం పోలింగ్ నమోదు

    కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు 38 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

     

  • 10 May 2023 01:38 PM (IST)

    ఎన్నికల్లో గందరగోళం.. ఈవీఎంలను పగలగొట్టిన గ్రామస్థులు

    కర్ణాటకలో విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఈవీఎంలను గ్రామస్థులు పగలగొట్టారు. ఎన్నికల సిబ్బంది‌పై దాడి చేశారు. పోలీసులను చితకబాది.. వాళ్ల దగ్గరనున్న ఈవీఎంలను చిత్తుగా పగలగొట్టారు. ఎన్నికల సిబ్బంది కారును పల్టి కొట్టించి ధ్వంసం చేశారు.

     

  • 10 May 2023 01:23 PM (IST)

    ఓటేసిన కాంతార ఫేమ్.. రిషబ్ శెట్టి

    కాంతారతో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలని ఆయన సోషల్ మీడియా వేదికగా సూచించారు.

     

  • 10 May 2023 01:13 PM (IST)

    సతీమణితో కలిసి వచ్చి ఓటేసిన నటుడు శివరాజ్‌ కుమార్

    కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, ఆయన సతీమణి, జేడీ(ఎస్‌) నేత గీతా శివరాజ్‌కుమార్‌ ఓటు వేశారు.

     

  • 10 May 2023 01:01 PM (IST)

    ఓటేసిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే

    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన సతీమణి రాధాబాయి ఖర్గే కలబురగిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

     

  • 10 May 2023 12:46 PM (IST)

    ఓటేసిన మంత్రి బీసీ నగేష్

    రాష్ట్ర మంత్రి, తిపటూరు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బీసీ నగేష్‌ కుటుంబసభ్యులు తిపటూరులో ఓటు వేశారు.

     

  • 10 May 2023 12:38 PM (IST)

    కుటుంబంతో కలిసి ఓటేసిన నటుడు డాలీ ధనంజయ

    కన్నడ నటుడు డాలీ ధనంజయ తన కుటుంబంతో కలిసి అర్సికెరెలోని కాలేనహళ్లి గ్రామంలో ఓటు వేశారు.

     

  • 10 May 2023 12:27 PM (IST)

    ఓటేసిన వధూవరులు

    కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మైసూరులోని పోలింగ్ బూత్‌లో వధూవరులు తమ కుటుంబంతో కలిసి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని నూతన వధూవరులు సూచించారు.

     

  • 10 May 2023 12:19 PM (IST)

    ఉదయం 11 గంటల వరకు 20.99 శాతం పోలింగ్

    కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11గంటల వరకు 20.99 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో గ్రేటర్‌ బెంగళూరులో 55 శాతం పోలింగ్ నమోదైంది.

     

     

  • 10 May 2023 11:34 AM (IST)

    ఓటేసిన మాజీ క్రికెటర్ శ్రీనాథ్

    మాజీ క్రికెటర్ జావగల్ శ్రీనాథ్ మైసూరులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యం కోసం మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన అభ్యర్థించారు.

     

  • 10 May 2023 11:28 AM (IST)

    ఓటుహక్కు వినియోగించుకున్న జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి

    కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి రామనగరలోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

     

  • 10 May 2023 11:26 AM (IST)

    ఓటేసిన నటుడు ఉపేంద్ర

    కన్నడ నటుడు ఉపేంద్ర బెంగళూరులోని ఓ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయన ఓటేశారు.

     

  • 10 May 2023 11:24 AM (IST)

    ఓటుహక్కు వినియోగించుకున్న మాజీ సీఎం సిద్ధరామయ్య

    కర్ణాటక మాజీ సీఎం, వరుణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామయ్య తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

     

  • 10 May 2023 11:23 AM (IST)

    ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

    బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కు పూలమాల వేసి దాని సమీపంలో అగరబత్తీలు కాల్చి పూజలు చేశారు.

     

  • 10 May 2023 11:22 AM (IST)

    ఓటేసిన బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప

    కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప శివమొగ్గలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

     

  • 10 May 2023 10:51 AM (IST)

    ఈ ఎన్నికల్లో దేశ భవిష్యత్‌ ఇమిడి ఉంది: సిద్ధరామయ్య

    కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వరుణ దేవాలయంలో పూజలు చేశారు. అంతకు ముందు మాట్లాడుతూ..  పని చేసే పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో ఈ దేశ భవిష్యత్తు కూడా ఇమిడి ఉందని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అన్నారు. కాంగ్రెస్‌కు 130 నుంచి 150 సీట్లు వస్తాయని తాను ఎప్పటినుంచో చెబుతున్నానన్నారు.

     

  • 10 May 2023 10:47 AM (IST)

    ఓటేసిన కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్

    కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనా హెబ్బల్ నియోజకవర్గంలో ఓటు వేశారు.

     

  • 10 May 2023 10:21 AM (IST)

    హ్యాట్సాఫ్.. ఓటేసిన తర్వాతే పెళ్లి!

    కాసేపట్లో పెళ్లనగా.. ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచింది ఓ నవ వధువు. కర్ణాటకలో ఓ వధువు ఓటు హక్కు వినియోగించుకుని పెళ్లికి రెడీ అయింది.

  • 10 May 2023 10:08 AM (IST)

    ఓటేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బెంగళూరులోని ఓ పోలింగ్ బూత్‌లో కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

     

  • 10 May 2023 10:06 AM (IST)

    కుటుంబంతో కలిసి ఓటేసిన మంత్రి నారాయణ గౌడ

    కర్ణాటక మంత్రి, బీజేపీ నాయకుడు నారాయణ గౌడ తన కుటుంబంతో కలిసి మాండ్యాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

     

  • 10 May 2023 10:02 AM (IST)

    బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ప్రహ్లాద్ జోషి

    కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హుబ్బల్లిలోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. "ప్రజలు ఈ ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది" అని ఆయన చెప్పారు.

     

  • 10 May 2023 09:48 AM (IST)

    కొనసాగుతున్న పోలింగ్.. ఉదయం 9గంటల వరకు 13 శాతం నమోదు

    కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, మాజీ సీఎం యడియూరప్ప, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటహక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటల వరకు 13 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో గ్రేటర్‌ బెంగళూరులో 55 శాతం పోలింగ్ నమోదైంది.

  • 10 May 2023 09:36 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు

    మంగళూరులోని పోలింగ్ బూత్‌లో బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

     

  • 10 May 2023 09:34 AM (IST)

    ఓటేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి

    ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

     

  • 10 May 2023 09:32 AM (IST)

    ఓటేసిన నవవధువు

    చిక్కమగళూరులోని పోలింగ్ బూత్ నంబర్ 165లో ఓ వధువు ఓటు వేసింది.

     

  • 10 May 2023 09:31 AM (IST)

    ఓటేసిన నటుడు గణేష్

    కన్నడ నటుడు గణేష్ ఆయన భార్యతో కలిసి వచ్చి బెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు.

     

  • 10 May 2023 09:30 AM (IST)

    ఓటుహక్కు వినియోగించుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి

    కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి మరి ఓటేయడం గమనార్హం.

  • 10 May 2023 09:27 AM (IST)

    ఓటేసిన నటుడు రమేష్ అరవింద్

    కన్నడ నటుడు రమేష్ అరవింద్ బెంగళూరులోని పోలింగ్ బూత్‌కు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

     

  • 10 May 2023 08:46 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు

    ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన ఓటు వేయడానికి బెంగళూరులోని పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి తన ఓటు వేసిన తర్వాత యువ ఓటర్లకు సందేశం ఇచ్చారు. "దయచేసి మమ్మల్ని చూడండి. మేము పెద్దవాళ్ళం కానీ మేము 6 గంటలకు లేచి ఇక్కడకు వచ్చి ఓటు వేశాం. దయచేసి మమ్మల్ని చూసి నేర్చుకోండి. ఓటు ప్రజాస్వామ్యంలో పవిత్ర భాగం.." అని సందేశం ఇచ్చారు.

     

     

     

     

  • 10 May 2023 08:42 AM (IST)

    ఓటేసిన కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్

    బీదర్‌లోని భాల్కీ ప్రాంతంలో కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే ఓటు వేశారు.

     

  • 10 May 2023 08:11 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న కర్ణాటక మంత్రులు

    కర్ణాటక మంత్రులు అరగ జ్ఞానేంద్ర, సీఎన్ అశ్వత్ నారాయణ్, కె.సుధాకర్‌, ఆర్‌.అశోకాలు  తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి వారి నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌లతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ వచ్చి ఓట్లు వేయాలని వారు అభ్యర్థించారు.

     

  • 10 May 2023 08:05 AM (IST)

    ఓటేసిన కన్నడ నటి అమూల్య

    కన్నడ నటి అమూల్య, ఆమె భర్త బెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

     

  • 10 May 2023 08:03 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

    కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ బెంగళూరులో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు.

     

  • 10 May 2023 07:32 AM (IST)

    పూజలు చేసిన బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప

    కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప తన కుటుంబ సమేతంగా శికారిపూర్‌లోని శ్రీ హుచ్చరాయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ఆయన కుమారుడు బీవై విజయేంద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

     

Show comments